రామ్ గోపాల్ వర్మ న్యూ మూవీ


 ఫిల్మ్‌ ఇండస్ట్రీలో కనివిని ఎరుగని రీతిలో సినిమాలను డైరక్ట్‌ చేస్తుంటాడు ఆర్జీవీ. రాజ్‌ పాల్‌ యాదవ్‌, ఆప్సరా రాణి, నైనా గంగూలీ జంటగా నటించిన లెస్బియన్‌ చిత్రం డేంజరస్‌ త్వరలోనే సరికొత్త రికార్డును సృష్టించనుంది. 

రామ్‌ గోపాల్‌ వర్మ డైరక్ట్‌చేసిన చిత్రం డేంజరస్‌ను  బ్లాక్‌ చెయిన్‌  ఎన్‌ఎఫ్‌టీగా విక్రయించబడుతోందని  ఆర్జీవీ ట్విటర్‌లో పేర్కొన్నారు. 90 నిమిషాల ఈ ఫీచర్‌ ఫిల్మ్‌ను ఎన్‌ఎఫ్‌టీ రూపంలో ప్రేక్షకులకు అందుబాటులో ఉంచనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆర్జీవీ ట్విటర్‌లో షేర్‌ చేస్తున్నారు. డేంజరస్‌ సినిమాను థియేటర్స్‌లోనే కాకుండా  పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో, పే పర్‌ వ్యూ ద్వారా ప్రేక్షకులు చూడవచ్చును. ఈ సినిమాను డేంజరస్‌ టోకెన్స్‌ లేదా క్రిప్టోకరెన్సీతో మన ఇండియన్‌ కరెన్సీతో కొనుగోలు చేయవచ్చును. అందుకోసం సపరేట్‌గా rgvdangertoken.com వెబ్‌సైట్‌ను కూడా రూపొందించారు.