TV77తెలుగు కొండపల్లి :
ఎన్నికల వేళ వలసల వల...!!
వైసీపీ లో చేరిన కరుడుగట్టిన టిడిపి వాదులు, సానుభూతి పరులు....!!!
ఎమ్మెల్యే వసంత సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న టిడిపి కార్యకర్తలు....!!!
కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల వేళ వలసల పర్వం ఊపందుకోవడంతో తెలుగు తమ్ముళ్లకు ఊహించని షాక్ తగిలింది.ప్రతిష్టాత్మక కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార వైసీపీకి టిడిపి గట్టి పోటీ ఇస్తుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఆ పార్టీ నేతలు నిరుత్సాహానికి నిస్సహాయతకు మద్య కొట్టుమిట్టాడుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ప్రచార పర్వం లో దూకుడు మీద ఉన్న వైసీపీకి టిడిపి నుండి జరిగిన వలసలు మరింత బూస్టింగ్ ఇచ్చినట్లైంది. కొండపల్లికి చెందిన కరుడుగట్టిన టిడిపి వాదులు, సానుభూతి పరులు వైసీపీ కండువా కప్పుకుని పార్టీలో చేరిపోయారు.ఎన్నికల వేడి రాజుకున్న వేళ వలసల పర్వం ఊపందుకోవడంతో వైసీపీ శ్రేణులు గెలుపు ధీమాతో పనిచేస్తున్నారు. రిపోర్టర్,సత్య.మైలవరం