ఎన్నికల బరిలో ఉంది ఎమ్మెల్యే నా..?? స్థానిక అభ్యర్థి నా..??


 TV77తెలుగు కొండపల్లి :

ఆరోపణల తోనే కాలయాపన తప్ప . అభివృద్ధి హామీల ఉసేది.??

అధికారం ఇస్తే కొండపల్లి ప్రజలకు ఎం చేస్తామో చెప్పే నాయకుడు ఏడి.??

ఒక పక్క అధికార పార్టీ ప్రజలకు హామీల వర్షం కురిపిస్తుంటే.టీడీపీ కేడర్ ఎమ్మెల్యే వసంత పై ఆరోపణల  వెల్లువ.!!!

ప్రజలు ఎం కావాలో.తెలుసుకున్న వాడే సిసలైన ప్రజా నాయకుడు.ఎమ్మెల్యే అదే చేస్తున్నారు. కానీ టిడిపి నేతలు ఎం చేస్తున్నారో ఒక సారి చూద్దాం.!!!

ప్రతిష్టాత్మక కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం తుది ఘట్టం మరి కొద్ది గంటల్లో ముగియనుంది.అయితే ప్రచార పర్వం లో ప్రజలకు చేరువ కావడం అత్యంత కీలకమైన అంశం. అయితే ప్రజలకు దగ్గర కావాలి అంటే వారి సమస్యలు ఏమిటి, వారికి రోడ్లు కావాలా, డ్రైనేజీ కావాలా.సంక్షేమం కావాలా తెలుసుకొని ఆ దిశగా హామీల జల్లు కురిపించాలి. ఇక ఇదే అంశం పై అధికార పార్టీ నేతలు పూర్తిగా సక్సెస్ అయ్యారు అని చెప్పొచ్చు.మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తో పాటు జిల్లా పరిషత్ వైస్ చైర్ పర్సన్ గరికిపాటి శ్రీదేవి, ఎంపిపి పాలడుగు జ్యోత్స్న, ఇతర పార్టీ నాయకులు మొత్తం రోడ్లు మీదకు వచ్చి ప్రజలకు ఎం కావాలో తెలుసుకుని స్పష్టమైన హామీ ఇస్తున్నారు.అంతేకాకుండా ఎమ్మెల్యేలు, మంత్రులు తో ప్రచారం నిర్వహించి ప్రజలకు మరింత చేరువ అయ్యే ప్రయత్నం చేశారు. కానీ టిడిపి నేతలు ఎం చేస్తున్నారో ఒకసారి చూద్దాం. కొండపల్లి మున్సిపాలిటీ కైవసం చేసుకోవడం కోసం బలమైన టిడిపి కేడర్ మొత్తం రంగం లోకి దిగారు. ఎంపి కేశినేని నాని,  మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యే లు అందరూ ప్రచార బాధ్యతలు చేపట్టగా వారి పరిధిలో వారు పని చేసుకుంటూ పోయారు. కానీ అత్యంత కీలకమైన నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మాత్రం ఎప్పటిలాగానే ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పై ఆరోపణల పరంపర కొనసాగించారు.ఇదే ఆరోపణల పర్వం గత మూడేళ్లుగా చేస్తూనే ఉన్నారు.అయితే ఎన్నికల ప్రచారం లో కూడా మాజీ మంత్రి వర్యులు అదే పంద ఎంచుకోవడం అసలు విషయం పక్క దారి పట్టింది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఎన్నికల సమయంలో తాము అధికారం లోకి వస్తె ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేసి, అభివృద్ధి చేస్తానని ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వాలి..కానీ ఇలాంటి ప్రధానమైన అంశం పక్కన పెట్టి ఎమ్మెల్యే వసంత ను టార్గెట్ చేసి విమర్శల పర్వం కొనసాగించారు.ఒక పక్క అధికార వైసీపీ చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమం తో పాటు భవిష్యత్ లో చేయబోయే అభివృద్ధి పై ప్రజలకు పూర్తి క్లారిటీ ఇస్తూ పోయారు.కానీ టిడిపి అధినాయకత్వం చిరిగిన 10 నోటు, పడిన డ్రైనేజీ గోడ అంటూ పదే పదే చెప్పుకొచ్చారు. అదంతా ముగిసిన అధ్యాయం కనుక ప్రజలు సైతం పెద్ద పట్టించుకున్న సందర్భం లేదు. అందుకు కారణం కూడా లేక పోలేదు..గత ఐదేళ్ల టిడిపి పాలన లో నియోజకవర్గ ప్రజలను నిండా ముంచేసిన నేపథ్యం ఉండటం ఇళ్ల స్థలాల విషయం సొంత పార్టీ నేతలకు కట్టబెట్టడం లాంటి ఘటనలు నెమరు వేసుకుంటున్న ప్రజానీకం.టిడిపి చేస్తున్న ఆరోపణలు లైట్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.  ప్రజలకు అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ అధికార పార్టీ అభ్యర్థులు దూసుకుపోతుంటే. ప్రతిపక్ష టిడిపి ఎమ్మెల్యే అలా చేశాడు, ఇలా చేశాడు అంటూ పాడిన పాట మళ్ళీ మళ్ళీ పాడుతున్నారు. మరి టిడిపి పాడుతున్న పాత పాటలు ఓట్లు రాలతాయా.?? జనంలోకి వస్తున్న అవినీతి నేతలను మళ్ళీ  నమ్మే అవకాశం ఉందా .??? అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అంటే ఇదే కాబోలు.చూద్దాం ప్రజా తీర్పు ఎలా ఉండబోతుంది.

ఇది విశ్లేషణ ..జనం మాట

రిపోర్టర్,సత్య. మైలవరం