యువకుడే కానీ ప్రజా సేవకుడు


 

 TV77తెలుగు  ఇబ్రహీంపట్నం:

తన పుట్టిన రోజున అనాధ పిల్లలకు అన్నదానం నిర్వహించే సేవ భావం ఉన్నవాడు...!!


రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకునే నిస్వార్థ సేవకుడు....!!


ఇలాంటి యువకులు రాజకీయాల్లో ప్రోత్సహిస్తే మరింత సేవ చేసే అవకాశం..!!


12వ డివిజన్ వైసీపీ అభ్యర్థిగా ప్రజల ఆశీర్వాదం కోసం శ్రమిస్తున్న మడుపల్లి ఆనంద్...!!

మడుపల్లి ఆనంద్ అంటే ఇబ్రహీంపట్నం ప్రజలకు దాదాపుగా అందరికీ సుపరిచితుడే. ఇబ్రహీంపట్నం సూర్య మెస్ అధినేత సూర్యనారాయణ తనయుడిగా, రాజకీయాలకు అతీతంగా అందరినీ సోదర భావం తో కలుపుకుపోయే నిస్వార్థ నిరాడంబరుడుగా ఆనంద్ కు గుర్తింపు ఉంది. తన పుట్టిన రోజు నిరుపేద పిల్లల సమక్షం లో జరుపుకునేంత మంచి మనసు ఉన్న ప్రజా సేవకుడు.పుట్టిన రోజు వస్తె సహాయ మాత, అన్నమ్మ మూగ చెవిటి పాఠశాలల్లో పండగ వాతావరణం ఉంటుంది.ఇలాంటి మంచి మనసు , సేవా గుణం ఉన్న యువకులు ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తె మరింత సేవ చేసే అవకాశం ఉంది. అయితే రాజకీయాల్లో ఇప్పుడు ఇప్పుడే మంచి పేరు సంపాదించుకున్న మడుపల్లి ఆనంద్ తన ప్రజాసేవను మరింత విస్తృతం చేసేందుకు సిద్ధం అయ్యారు.మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆశయాలకు అనుగుణంగా, ప్రజా సేవ పరమావధిగా కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో బరిలో నిలిచారు. 12వ డివిజన్ వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి గా పోటీలో ఉన్నారు. మరి ఇలాంటి నవ యువ సేవకులకు ప్రజా ప్రతినిధి గా ఒక అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని ఇబ్రహీంపట్నం జర్నలిస్టుల ఐక్య వేదిక ద్వారా 12వ డివిజన్ ప్రజలకు మడుపల్లి ఆనంద్ విజ్ఞప్తి చేస్తున్నారు.మంచి మనసుతో ఆనంద్ ను దీవించి మీ ఓటు తో అఖండ మెజార్టీ ఇచ్చి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతం కావాలంటే ఆనంద్ లాంటి యువకులు ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలి వారిని ప్రజలు గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది.

రిపోర్టర్,సత్య..మైలవరం