నోటీసు లేకుండా సెల్లార్ లో షాపు ధ్వంసం చేసిన కార్పొరేషన్ అధికారులు


 TV77తెలుగు  రాజమండ్రి :

నాయి బ్రాహ్మణ సంఘం ఖండన

నగరంలో నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ అండతో సెల్లార్లలో వ్యాపార సంస్థలు నిర్వహిస్తుండగా చలనం లేని కార్పొరేషన్ అధికారులు రాజకీయ కక్షతో ఒక సెల్లార్ లోని షాపును ధ్వంసం చేసిన సంఘటన నాయి బ్రాహ్మణ కులస్తుల లో ఆందోళన కలిగిస్తుంది. 

ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

స్థానిక తిలక్ రోడ్ లో జెట్టీ బిల్లింగ్ లో సెల్లార్ లో సెలూన్ స్పానిర్వహించేందుకు కార్పొరేషన్ అధికారులు పెదగాడి వెంకటేశ్వరరావుకు 2020లో ట్రేడ్ లైసెన్స్ మంజూరు చేయడం జరిగిందని జిల్లా నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు సుందరపల్లి గోపాలకృష్ణ. అందన పల్లి  సత్యనారాయణ పేర్కొన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ కార్పొరేషన్ అధికారులు షాప్ యజమాని గాని. బిల్లింగ్ గాని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా  రాజకీయ కక్షతో బిసి కులస్తుల మని చులకన భావన తో కార్పొరేషన్ అధికారులు సెల్లార్ లోని రెండు రోజుల క్రితం షాపును ధ్వంసం చేశారని  వాపోయారు. లక్షలాది రూపాయలు విలువ చేసే సామాగ్రి నష్టం జరిగిందని అధికారులు ఏకపక్షంగా వ్యవహరించడం వల్ల 10 మంది ఉపాధి కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో చాలా చోట్ల సెల్లార్ లో వ్యాపార సంస్థలు నిర్వహిస్తున్నారని వాటి జోలికి వెళ్లకుండా వెనుకబడిన వర్గాలకు చెందిన తమ షాపును ధ్వంసం చేయడం వెనక వివక్షత ఉందని ఆరోపించారు. దీనిపై తమకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన చేస్తామని లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వారు తెలిపారు. ఈ సమావేశంలో నాగబాబు, సాయి కృష్ణ, శ్రీనివాస రావు, తంటికొండ అనంతరావు  తదితరులు పాల్గొన్నారు.