నాడు వివక్ష... నేడు దక్షత


TV77 తెలుగు కొండపల్లి
 నాడు టిడిపి పాలనలో బీసీలకు అన్యాయం జరిగినా...!!! నేడు వైసీపీ పాలనలో న్యాయమే జరుగుతుంది...!!

బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన వారికే పట్టం కట్టండి...!!!

కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను అఖండ మెజారిటీ తో గెలిపించండి....!!!

8వ డివిజన్ వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి షీనా భేగం ను గెలిపించాలని విజ్ఞప్తి చేసినా బీసీ సంఘాల నేతలు...!!

కొండపల్లి మున్సిపాలిటీ వ్యాప్తంగా ఉన్న మెజార్టీ బిసిలకు ఆది నుండి అన్యాయమే జరుగుతుందని బిసి సంఘ నేతలు తెలిపారు. నాడు టిడిపి ప్రభుత్వ పాలనలో అణచివేతకు గురైన బిసిలు అన్ని రకాలుగా నష్టపోయారని అందుకు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఒక ముఖ్య కారణం అని గుర్తుచేశారు. అయితే నాడు నష్టపోయిన నేడు వైసీపీ ప్రభుత్వ పాలనలో అన్ని విధాలుగా బిసిలకు పెద్దపీట వేస్తుందని చెప్పారు. మైలవరం  నియోజకవర్గ పరిధిలో మెజారిటీ బీసీ లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అదే తరహాలో కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో మెజారిటీ సీట్లు కేటాయించడం తో పాటు అత్యున్నత పదవులు బిసిలకు కట్టబెట్టి బిసిల పట్ల తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటునట్లు చెప్పారు. బిసిలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న వైసీపీ అభ్యర్థులను అఖండ మెజారిటితో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కొండపల్లి 8వ డివిజన్ వైసీపీ కౌన్సిలర్ అభ్యర్ధి షీనా భేగo ను 8వ వార్డు ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.

రిపోర్టర్,సత్య..మైలవరం