అరాచక పాలనను ఓటుతో సమాధి చేయండి...!!!
వైసీపీ ప్రభుత్వానికి బుద్ది చెప్పడానికి ఇదో గొప్ప అవకాశం...!!
ఎన్నికల నియమావళి తుంగలో తొక్కిన వైసీపీ నేతలు..!!
కొండపల్లి మున్సిపాలిటీ 29 వార్డు కౌన్సిలర్లను అఖండ మెజారిటీ తో గెలిపించుకోవాలి...!!!
16వ వార్డు టిడిపి కార్యాలయం ప్రారంభోత్సవం లో టిడిపి అగ్ర నాయకత్వం పిలుపు...!!
రాష్ట్రంలో కొనసాగుతున్న రాక్షస పాలనకు చరమగీతం పాడే అవకాశం వచ్చిందని ఓటు తో అరాచక పాలనకు సమాధి కట్టాలని టిడిపి అగ్ర నాయకత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల బరిలో నిలిచిన 16 వార్డు కౌన్సిలర్ అభ్యర్ధి ధరణికోట విజయలక్ష్మి ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయ ప్రారంభానికి హాజరైన టిడిపి నాయకులు మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు, కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే వంగలపుడి అనిత హాజరై ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో విసిగిపోయిన ప్రజలకు కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికలు గొప్ప అవకాశంగా చెప్పారు. సామాన్యుడి నడ్డి విరిచే విధంగా పాలన సాగుతున్న నేపథ్యంలో మీ విలువైన ఓటుతో అరాచక శక్తులను తరిమి కొట్టాలన్నారు . కొండపల్లి మున్సిపాలిటీ 29 వార్డులను కైవసం చేసుకొని పురపాలక సంఘం పై టిడిపి జెండా ఎగరేయలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
రిపోర్టర్, సత్య.. మైలవరం