TV77తెలుగు కొండపల్లి:
89 నామినేషన్ల వెనుక వ్యూహం ఏమిటో జర చెప్పండి సామీ...??
భారీ ఎత్తున నామినేషన్ల దాఖలు చేయడం వెనుక ఆంతర్యం బోధపడక తలలు పట్టుకుంటున్న నేతలు...!!
కులం కార్డు ఓట్లలో చీలిక తీసుకురావడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది అనేది విశ్లేషకుల అంచనా....!!!
ఓటమి తప్పదన్న చోట వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం...!!
కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయ రాజకీయ పార్టీలు ఎలా అయిన అన్ని వార్డులను కైవసం చేసుకోవాలని బలంగా పనిచేస్తున్నాయి. అందుకోసం అవసరమైతే రాజకీయంగా తమకు ఉన్న అపారమైన అనుభవాన్ని రంగరించి వ్యూహరచన చేస్తున్నాయి. అన్ని పార్టీలు ఇలా తమకు ఉన్న రాజకీయ పరిజ్ఞానం తో అడుగులు వేస్తుండగా ప్రతిపక్ష టిడిపి వ్యూహరచన మాత్రం ఎవరికీ అంతుచిక్కడం లేదు.. అధికార వైసీపీ 64 నామినేషన్లు దాఖలు చేయగా టిడిపి మాత్రం 89 నామినేషన్లు వేశారు...ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది.కొండపల్లి మున్సిపాలిటీ మొత్తం 29 వార్డులు ఉండగా పార్టీ నుండి ఒక అభ్యర్థి తో పాటు ఇంకో అభ్యర్థి డమ్మిగా వేసే అవకాశం ఉంది.. అయితే సీటు దక్కని అభ్యర్థులు రెబల్స్ గా దిగినా ఆ సంఖ్య కూడా అధికశాతం అధికార పార్టీ కి ఆ బెడద ఉండే అవకాశం ఉంది. అన్ని కలుపుకున్నా మొత్తంగా 60 ఎక్కువ అనుకుందాం. కానీ ఇక్కడ అనూహ్యంగా అధికార పార్టీ 64 నామినేషన్ల దాఖలు చేస్తే ప్రతి పక్ష టిడిపి ఏకంగా 89 నామినేషన్లు దాఖలు చేసి తమ వ్యూహరచన కు ఆద్యం పోశారు. అయితే టిడిపి అధినాయకత్వం వ్యూహం ఎలా ఉన్నా రాజకీయ నేతల్లో మాత్రం ఇది ఒక్కింత ఆశ్చర్యానికి గురిచేసే అంశం గానే చెప్పొచ్చు..!!
ఇక మా జర్నలిస్ట్ ఐక్య వేదిక ఎనాలిసిస్ ప్రకారం..
1.కులం ప్రాతిపదికన ఓట్లు చీలిక తెచ్చి అభ్యర్థి గెలుపును గండి కొట్టే వ్యూహం.
2.పార్టీ బలహీనంగా ఉన్న చోట రెబల్స్ పేరిట బరిలో దిగితే ఫలితాలు తారుమారు.
3.తెర ముందు పెద్దగా పోటీ ఇవ్వలేని వారిని పరిచయం చేసి పైనల్ గా బలమైన అభ్యర్థిని బరిలో నిలబెట్టడం.
4. అధికార పార్టీ ప్రలోభాలకు తలోగ్గితే ఆ స్థానం ఏకగ్రీవం కాకుండా అభ్యర్థులను నిలబెట్టడం.
5. పై అంశాలు ఏమి కాకుండా మొత్తం డమ్మిలుగా పెట్టడం.
ఏదీ ఏమైనా కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో టిడిపి జెండా ఎగరేయడం కోసం, అధికార వైసీపీని మట్టి కరిపించడం కోసం టిడిపి అధినాయకత్వం ఎక్కడా తగ్గేదే లే.....అన్నట్లే....!!
రిపోర్టర్, సత్య. మైలవరం