బిజేపి సిద్దాంతాలు నచ్చి


 TV77తెలుగు కొండపల్లి :

కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో 5వ వార్డు కౌన్సిలర్ గా నామినేషన్ దాఖలు చేసిన కూచిపూడి రమేష్...!!!

ప్రజా సేవ చేయడమే లక్ష్యంగా ఎన్నికల్లో  పోటీ చేస్తున్నట్లు వాఖ్య...!!!

అభ్యర్థి గెలుపు లక్యంగా పని చేస్తామని బిజేపి శ్రేణులు ధీమా..!!

భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నచ్చి బిజేపి తరుపున కొండపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నట్లు కూచిపూడి రమేష్ స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నం జర్నలిస్టులు ఐక్య వేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బిజేపి శ్రేణులు మాట్లాడుతూ ప్రజా సేవ చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు చెప్పారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో అటో డ్రైవర్స్ యూనియన్ కు విశేష సేవలు అందించిన కూచిపూడి రమేష్ ను 5వ వార్డు ప్రజలు అఖండ మెజారిటీ తో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.కొండపల్లి మున్సిపాలిటీ 5 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్ధిగా పోటీ లో ఉన్నానని ప్రజాసేవకులను ఆశీర్వదించాలని కోరారు.

రిపోర్టర్, సత్య.. మైలవరం