TV77తెలుగు రాజమండ్రి:
అసెంబ్లీ సాక్షిగా జరుగుతున్న బూతులుకు చట్టం చేయాలి.
శాసన కర్తలకు శాసనాలు వర్తించవా !
శాసనసభ్యులును సంస్కరించాలి.
కుటుంబాలకు డి ఎన్ ఏ సర్టిఫికెట్స్ కావాలా !
ఏపి కి మంచిరోజులు రావాలి.
ఓటర్లను ఓటర్ సంస్కరించు కోవాల్సిన అత్యవసర పరిస్థితులు ప్రతి ఆంధ్రుడు భుజస్కంధాల పై నేడు వుందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పిసి) ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో ఆర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, భద్రత, సంక్షేమం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక వసతులు, మౌలిక సదుపాయాలు, మెరుగైన రోడ్లు, మెరుగైన ప్రభుత్వ విద్యా, వైద్యం, మహిళా భద్రత, ఆదర్శ వంతమైన రాజధాని నిర్మాణం, కార్మిక సంక్షేమం వంటి ప్రధాన అంశాల కు అసెంబ్లీని వేదికగా చేసుకుని ఆ దిశగా అభివృద్ధి కోసం పాటుపడే శాసనసభ్యులు నేడు ఆంధ్రప్రదేశ్ చట్ట సభలో లేకపోవటం ప్రజల దురదృష్టం గా భావించాలని,పదవులను అడ్డు పెట్టుకుని ప్రజా ధనాన్ని దోచుకునే వారే నేడు అసెంబ్లీ హీరోలుగా చలామణి అవుతున్నారని, అసెంబ్లీ సాక్షిగా బూతులు, అవాస్తవ రంకు పురాణాలకు చట్ట సభను వేదికగా చేసుకుంటున్నారని,
నేటి చెత్త పాలకుల బూతులు, రోత మాటలు చర్చించుకోవటానికి ఏపి అసెంబ్లీ ఒక గంటకు సుమారు 25 లక్షలు పైబడి ప్రజా ధనాన్ని వృదాచేస్తున్నారని ఆయన తీవ్ర ఆవేదన చెందారు.
నేటి బూతుల ప్రజా ప్రతినిధులు శాసన కర్తలుగా చట్ట సభల్లో కొనసాగుతున్నారని, అలాంటి వారు చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహిస్తు చట్టసభలను అగౌరవ పరుస్తుంటే చూడటానికి ఏపి అసెంబ్లీ శాసన సభగా కాకుండా చంచల్ గూడ జైలు ప్రాగణం గా కనబడుతుందని, ప్రస్తుత పాలకులకు చట్టం అన్నా, న్యాయస్థానం అన్నా గౌరవం లేకుండా పోతుందని, ప్రజలు పన్నులు కడుతు అక్రమ కేసులు పెట్టించుకుంటు తన్నించు కుంటున్నారని, గత కొన్ని సంవత్సరాలుగా వివాదాలు తోను, రాజకీయ రచ్చలతోను, శాంతిభద్రతల సమస్యల తోను ఏపిలో అశాంతిని రేకెత్తిస్తున్నారని,
పాలనపై విసుగు చెందుతున్న మెజార్టీ వర్గాలు నేరాల బాట పడుతున్నారని, 2 వ బీహార్ గాను, నేరాంధ్రప్రదేశ్ గాను రూపాంతరం చెందుతుందేమోనని బిడ్డల భవిష్యత్ ను తలచుకుంటున్న మెజార్టీ ఆంధ్రులు భయాందోళన చెందుతున్నారని ఆయన తెలిపారు.
సరైన సంస్కరణలు, సంస్కారం లేని విధంగా నేడు ఏపి అసెంబ్లీ, శాసనసభ్యులు తీరు కొనసాగుతుందని,ఏపిలో నేరగాళ్లు భద్రత గా జీవిస్తున్నారని, సామాన్యులు బిక్కు బిక్కు మంటు బ్రతకాల్సి వస్తుందని, మన భారత ఎన్నికల సంఘం పని తీరు, నిబంధనలు సైతం చట్ట బద్దంగా అమలు చేయలేక పోతుందని, ప్రజలు మోసపోవటానికి, ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోలేక పోవటానికి, ఓటుకు నోటును కట్టడి చేయలేక పోవటానికి ఎన్నికల సంఘం బలహీనతలు, వైఫల్యాలు ప్రధాన కారణంగా భావించ వచ్చునని,భారత ఎన్నికల సంఘం ఏనాడు అక్రమాలకు తావులేకుండా నిబంధనలకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించిన చరిత్ర లేకపోయిందని,
టి ఎన్ శేషన్ గారి సమయంలో కొన్ని ఖచ్చితమైన నిబంధనలను అమలు పరచి తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని ఆయన గుర్తు చేసారు.
ఆంధ్రా పాలకులకు రాజకీయ ఆరోపణ లకు కుటుంబ ప్రతిష్టలను, బిడ్డల ఆత్మ గౌరవాన్ని, ఆడపడుచులు, తల్లుల ఆత్మగౌరవాన్ని బజారున పెడుతు వారు కూడా బజారున పడుతున్నారని, వీరి చేతకాని సన్నాసి తనానికి నిదర్శనంగా బిడ్డల జన్మ కారణానికి డి ఎన్ ఏ సర్టిఫికెట్స్ ను కోరటం విషయానికి తక్కువ నర్తనశాలకు ఎక్కువ అన్నట్టు వుంటుందని వీరి వీధి బాగోతం , ఆంధ్రప్రదేశ్ పాలకుల అసెంబ్లీ అరాచకాలపై న్యాయస్థానాలు సుమోటోగా స్పందించి అసాంఘిక చర్యలకు, ఆరోపణలకు, బూతులుకు అడ్డుకట్ట వేయాలని, ప్రజలు కూడా అసెంబ్లీ లో రెండు పార్టీలకే అవకాశాలు ఇవ్వకుండా అన్ని రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహించే విధంగా అర్హత కల్పించి ప్రజా స్వామ్యాన్ని కాపాడాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్ లో మార్పు తథ్యం అని, ఆ మార్పు తో కూడిన తిరుగుబాటులో నేటి పాలకులకు, అక్రమ అవినీతి పాలనకు రాజకీయ సమాధి కట్టడం ఖాయమని ఆర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ హెచ్చిరించారు.
సభకు పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు.
ఈ సభలో ఆర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ డివిఆర్ మూర్తి, దుడ్డె త్రినాద్, సిమ్మా దుర్గా రావు, వర్ధనపు శరత్ కుమార్, దుడ్డె సురేష్, వాడపల్లి జ్యోతిష్, పిల్లాడి ఆంజనేయులు, కోమర్తి గోపి శ్రీనివాసరావు, అండుబోయిన నరసింహమూర్తి తదితరులు పాల్గొనియున్నారు.
మేడా శ్రీనివాస్, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్