TV77తెలుగు కొండపల్లి:
చైర్మన్ అభ్యర్థి ఎంపికపై ఇరు పార్టీల నేతల్లో ఎడతెగని ఉత్కంఠ....!!!
నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న కొండపల్లి మున్సిపాలిటీ 29 డివిజన్ల కౌన్సిలర్లు.....!!
29 మంది కౌన్సిలర్ లకు గాను 29 మంది హాజరు కాని పక్షంలో చైర్మన్ అభ్యర్థి ఎన్నిక వాయిదా వేసే అవకాశం...!!!
చారిత్రక కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో సంచలన విజయాలు నమోదు చేసిన ఆయ పార్టీల కౌన్సిలర్ల కొలువులకు అధికారులు ఏర్పాట్లు చేశారు.నేడు కొండపల్లి మున్సిపల్ కార్యాలయం లో జరగనున్న పురపాలక సంఘం కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవం సంభందించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే చైర్మన్ , వైస్ చైర్మన్ల ఎన్నికకు సంభందించి మొత్తం 29 డివిజన్ల కౌన్సిలర్ల హాజరైతే ఎన్నిక ఉంటుందని స్పష్టం అవుతోంది.ఈరోజు చైర్మన్ ఎన్నిక జరగని పక్షంలో వాయిదా వేసి మరొక రోజు ఎన్నిక ఉంటుందని అధికార వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఏది ఏమైనా ఎప్పుడు ఎప్పుడా అని ఎదురుచూసిన కొండపల్లి మున్సిపాలిటీ పాలక వర్గం ఏర్పాటు జరిగితే మొట్ట మొదటి పాలకవర్గం చూడవచ్చు.
రిపోర్టర్, సత్య.మైలవరం