TV77తెలుగు రాజమహేంద్రవరం :
మ్యారేజ్ మీడి యేటర్స్ అసోసియేషన్ ను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని స్వర్ణముఖి ఆంధ్ర మ్యారేజ్ మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు కె వెన్నెల, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల సీతా రామరాజు లు విజ్ఞప్తి చేశారు. ఆంధ్ర ,కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకి చెందిన మ్యారేజ్ మీడియేటర్స్ సమావేశం స్థానిక అల్యూమినియం హాల్ లో శుక్రవారం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన వెన్నెల, సీతా రామరాజు లు మాట్లాడుతూ కరోనా మహమ్మారి వేళ మ్యారేజ్ మీడియేటర్ల జీవితాలు దుర్భరంగా మారాయని రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు అమలు చేసిన విధంగానే తమ సంఘం సభ్యులకు సంక్షేమ పథకాలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు, పింఛన్లు కమ్యూనిటీ హాల్స్ నిర్మించి ఇవ్వాలని ఆమె కోరారు . మూడు రాష్ట్రాల నుంచి సుమారు 250 మంది పాల్గొన్న ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకులు ఆకుల సీతారామ రాజు, జి. నాని, కేతరాజు, వెంకటేశ్వరరావు, దుర్గారావు, ఎస్ రామారావు ముత్యాలు , పల్ల వెంకటేశ్వరరావు, గుమ్మడి శ్రీ ను , సోమరాజు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్వర్ణ ముఖి సీనియర్ మేరేజ్ మీడియాటర్స్ ను సన్మానించారు.