కొవ్వూరు రోడ్ కం రైల్వే వంతెన పైనుంచి గోదావరి నదిలోకి దూకి వ్యక్తి గల్లంతు

 

   TV77తెలుగు  కొవ్వూరు :

తాడేపల్లిగూడెం మండలం కడకట్ల గ్రామానికి చెందిన  అడపా రమేష్ (41) హైదరాబాదులో కారు డ్రైవర్ గా పనిచేస్తున్న రమేష్ గత కొంత కాలంగా మానసిక పరిస్థితి బాగా లేకపోవడంతో నిడదవోలు మండలం సురపురం గ్రామంలో అత్తవారి ఇంటిదగ్గర ఉంటున్నాడు. సోమవారం ఉదయం కారులో చికిత్స నిమిత్తం రాజమండ్రి  తీసుకువెళ్తుండగా కారు టైర్ కు పంచర్ కావడంతో డ్రైవర్ టైర్ మార్చే పనిలో ఉండగా కారు నుండి  కింద్రకిదిగి బ్రిడ్జి మీద నుండి గోదావరిలోకి దూకిన రమేష్. రమేష్ కు ఇద్దరు కుమార్తెలు. శ్వేత ఐదు సంవత్సరాలు,సాయి రెండు సంవత్సరాలు.గాలింపు చర్యలు చేపడుతున్న కొవ్వూరు  పోలీసులు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.