TV77తెలుగు రాజమహేంద్రవరం క్రైమ్:
అక్రమంగా నిల్వచేసిన దీపావళి బాణసంచాను రాజమహేంద్రవరం ఒకటో పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అర్బన్ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఆదేశాల మేరకు సెంట్రల్ జోన్ డిఎస్పి సంతోష్ పర్వవేక్షణలో ఒకటో పట్టణ లా అండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్ ఆర్ గోవిందా రాజు, సబ్ ఇన్స్పెక్టర్లు గత నెల 31 వ తేదీన తనికీలు చేశారు. మెయిన్ రోడ్ లో అక్రమంగా నిల్వ చేసిన దీపావళి బాణాసంచాను గుర్తించారు వాటికి ఏటువంటి అనుమతులు లేకపోవడం తో స్వాధీనం చేసుకొన్నారు. నిల్వ చేసిన ముగ్గురు వ్యక్తులపై రెండు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసారు. దీపావళి పండుగ నేపథ్యంలో అనుమతులు లేకుండా బాణాసంచా విక్రయాలు జరిపినా, నివాస గృహాల మధ్యలో బాణాసంచా నిల్వ చేసినా కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. బాణాసంచా అక్రమ నిల్వలపై సమాచారం అందించాలని కోరారు.