చేతి వేళ్ళు కావండోయ్


 TV77తెలుగు   యూరప్ :

ప‌చ్చ‌ని మొక్క‌ల మ‌ధ్య చేతి వేళ్లు క‌నిపిస్తున్నాయా.కానీ 
ఇవి చేతి వేళ్ళు కావండోయ్.ఇదో ర‌క‌మైన ఫంగ‌స్ అని మీకు తెలుసా. వీటిని డెడ్ మాన్స్ ఫింగర్స్ అంటారు. వాటి సైంటిఫిక్ నేమ్ జిలారియా పాలీమోర్ఫా . యూరప్ దేశాల్లో ఎక్కువగా ఈ ఫంగస్ పెరుగుతుంది. తీర ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. ఇవి చనిపోయిన చెట్లు, పాడైన కలప నుంచి పెరుగుతాయి. భూమిలో ఇంకిపోయే కలప నుంచి కూడా ఉద్భవిస్తాయి. ఇవి రకరకాల రంగుల్లో ఉంటాయి. ఎక్కువగా మనిషి చెయ్యి ఆకారంలో ఉంటాయి.
చేతికి ఐదు వేళ్లు ఉన్నట్లే వీటికి కూడా ఐదారు వేళ్లు ఉంటాయి. షాకింగ్ విషయమేంటంటే ఇవి చనిపోయిన మనిషి వేళ్లలా ఉంటాయి. మనిషి శరీరం రంగు మారి ఉన్నట్లుగా ఇవి ఉంటాయి. ఈ ఫంగస్‌లో దాదాపు 100 రకాలున్నాయి. కొంతమంది వాకర్లు నడక దారిలో చేతిని తాము చూశామని చెప్పారు. ఐతే ఇలా చాలా మంది చాలా చోట్ల చూస్తున్నట్లు చెప్పడంతో. ఆ చేతులపై హాట్ డిబేట్ నడిచింది. చివరకు ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డింది.