బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
azaroa 23, 2021
మరో అల్పపీడనం ఏర్పడుతోందని, రాగల అయిదు రోజుల్లో భారీ వర్షాలుంటాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మొన్న తమిళనాడు వద్ద వాయుగుండం తీరం దాటిన తర్వాత అనంతపురం, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈసారి కూడా నెల్లూరు, కడప, ప్రకాశం, చిత్తూరు జిల్లాలపైనే తీవ్ర స్థాయిలో ప్రభావం ఉంటుందని, ఈ నెల 27 నుంచి ఆ నాలుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తాజా నివేదికలో అధికారులు పేర్కొన్నారు. అనంతపురం జిల్లాతో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాల తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇప్పటికే నెల్లూరు, కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాలు వరద ప్రభావంతో తల్లడిల్లాయి. తాజాగా అతి భారీ వర్ష సూచన.