చైర్మన్ ఎంపిక విత్ 144 సెక్షన్..!!!


 TV77తెలుగు కొండపల్లి :

కాకి నీడలో ప్రతిష్టాత్మక కొండపల్లి మున్సిపాలిటీ పాలకవర్గం ఎన్నిక...!!

పాలకవర్గం ఎవరు అన్నదానిపై కొనసాగుతున్న ఎడతెగని ఉత్కంఠకు నేడు తెర పడే అవకాశం....!!!

చైర్మన్ అభ్యర్థి ఎంపిక ఫలితాలు మాత్రం కోర్టు పరిధిలోకి....!!!

కొండపల్లి మున్సిపాలిటీ పాలకవర్గ కొలువులపై నేడు స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.16 మంది సభ్యుల సంఖ్యా బలం , ఎంపి ఎక్సోఫిషియ ఓటు తో కొండపల్లి మున్సిపాలిటీ టిడిపి వశం చేసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత రెండు రోజులుగా కొనసాగుతున్న హైడ్రామా కు హైకోర్ట్ ఆదేశాలతో పాలకవర్గ  ఎన్నికపై క్లారిటీ వచ్చింది. పోలీసు బలగాల మోహరింపు తో ఎన్నిక జరగాలని కోర్టు ఆదేశాలు జారీ చేయడం తో కొండపల్లి వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ నేడు కొండపల్లి మున్సిపాలిటీ పాలకవర్గ కొలువులు జరగనున్నాయి. అయితే ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఫలితాలు ప్రకటించవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేయడం తో చైర్మన్ పదవికి సంభందించి ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. 

రిపోర్టర్,సత్య. మైలవరం