TV77తెలుగు కొండపల్లి:
టిడిపి పాలనలో ఎన్నో బ్రతుకులు కూలిపోయాయి వాటికి సమాధానం చెప్పి ఓట్లు అడగండి...!!!
ఓటమి తప్పదని పసలేని ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు...!!
కొత్తగెట్ ప్రజలకు తీరని అన్యాయం చేసింది టిడిపి నేతలు కాదా..??
కొండపల్లి ఇబ్రహీంపట్నం అభివృద్ధికి వినియోగించాల్సిన నిధులు దారి మళ్లించింది మీరు కాదా..??
జర్నలిస్టుల ఐక్య వేదిక మీడియా చిట్ చాట్ లో టిడిపి నేతల పై ఆగ్రహం వ్యక్తం చేసిన 26వ వార్డు కౌన్సిలర్ అభ్యర్ధి గుంజ శ్రీనివాస్....!!
కొండపల్లి మున్సిపాలిటీ వ్యాప్తంగా అనేక అభివృద్ధి పనులు, పూర్తి స్థాయిలో డ్రైనేజీ వ్యవస్థ నిర్మించిన ఘనత మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కే దక్కుతుందని 26వ వార్డు కౌన్సిలర్ అభ్యర్ధి గుంజ శ్రీనివాస్ స్పష్టం చేశారు. జరుగుతున్న అభివృద్ధి చూసి తమకు ఓటమి తప్పదని టిడిపి నేతలు దుష్ప ప్రచారానికి తెర తీశారని 26వ వార్డు కౌన్సిలర్ అభ్యర్ధి గుంజ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వసంత నిస్వార్థ పాలనలో ఎక్కడో ఒక డ్రైనేజీ కూలిందని ఆరోపిస్తున్నారు సరే... మరి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు పాలన లో ఎన్ని బ్రతుకులు కూల్చారో ప్రజలకు తెలియనివా అని తేల్చి చెప్పారు.ప్రభుత్వ నిధుల తో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సింది పోయి కొండపల్లి , ఇబ్రహీంపట్నం అభివృద్ధికి వినియోగించే డాక్టర్ ఎన్ టీటీ పీస్ సీఎస్ఆర్ నిధులు వినియోగించి కొండపల్లి , ఇబ్రహీంపట్నం ప్రజలకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు.కొత్తగేట్ ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి పత్త లేకుండా పోయిన టిడిపి నేతలు కనీసం ఆ ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించకుండా వదిలేశారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం అధికారం లోకి రాగానే ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కొత్తగేట్ అభివృద్ధి కట్టుబడి పనిచేసారని తెలిపారు. ఎమ్మెల్యే వసంత పాలన లో కొత్త గేట్ ప్రాంతంలో సిసి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ వచ్చిందన్నారు. కొత్తగేట్ ప్రాంతం లో అభివృద్ధి చేసి ఓట్లు అడుగుతున్నామనీ అభివృద్ధి నిరోధకలు ఎవరు, అభివృద్ధి చేయగల సమర్థులు ఎవరో ప్రజలు గ్రహించి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
రిపోర్టర్,సత్య. మైలవరం