బైక్ ఆర్టీసీ బస్సు ఢీ


  TV77తెలుగు గన్నవరం క్రైమ్ :

 మండలం కేసరపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. సావర గూడెం జంక్షన్ వద్ద ముగ్గురు వ్యక్తులతో వెళ్తున్న బైక్ ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమించింది. దీంతో స్థానికులు క్షతగాత్రులను వెంటనే విజయవాడ ఆస్పత్రికి తరలించారు. ఏలూరు నుండి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికులను వేరే బస్సులో వారి నీ  తరలించారు.