ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామి వైభవాన్ని ఉత్తర భారతదేశంలోనూ చాటిచెప్పేందుకు కృషి చేస్తుందని వై.వి.సుబ్బారెడ్డి


TV77తెలుగు తిరుపతి :

 కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామి వైభవాన్ని ఉత్తర భారతదేశంలోనూ చాటిచెప్పేందుకు కృషి చేస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. ఆయన ఢిల్లీలో టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్‌పర్సన్‌గా వేమిరెడ్డి ప్రశాంతిని నియమించినట్లు ఆయన తెలిపారు. తదుపరి మీడియాతో మాట్లాడుతూ. ఉత్తర భారతదేశంలోని ఢిల్లీ, కురుక్షేత్ర మరికొన్ని ప్రాంతాల్లో టీటీడీ ఆలయాలున్నాయని. కొన్ని ఆలయాల నిర్మాణాలకు ఇప్పటికే శంకుస్థాపన చేశామని ఆయన వెల్లడించారు. టీటీడీ సనాతన ధర్మాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అయోధ్యలో కూడా స్థలం కేటాయించాలని ఇప్పటికే రామజన్మ భూమి ఆలయ నిర్మాణ కమిటీని కోరినట్లు ఆయన తెలిపారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలను టీటీడీ కొనుగోలు చేస్తుందని వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నామన్నారు.