బాణసంచా వ్యాపారం లో జీఎస్టీ పనులను
సరళీకరించాలి
బాణసంచా హోల్ సేల్ వ్యాపారి మామిడిపల్లి రామకృష్ణ విజ్ఞప్తి
TV77తెలుగు రాజానగరం:
బాణసంచా వ్యాపారం లో రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీ పన్ను సరళీకరించాలని బాణసంచా హోల్ సేల్ వ్యాపారి మామిడిపల్లి రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. జీఎస్టీ పన్ను రకరకాలుగా ఉందని దాంతో చిన్న. చిరు వ్యాపారులు రిటైల్ బాణసంచా వ్యాపారం లేక ఉపాధి కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జిఎస్టి పన్ను చెల్లింపులో ఒకే చోట అమలు చేయాలని ముగ్గురు నలుగురికీ కలిపి జీఎస్టీ పన్ను వసూలు చేస్తున్నారని రసీదులు మాత్రం ఒక్కరికే ఇస్తున్నారని ఆయన వాపోయారు. ఈ విధానం వల్ల మిగతా వారికి పోలీసు. పైరు. సేల్స్ టాక్స్ అధికారుల నుండి వేధింపులు ఇబ్బందులు జరిమానాలు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా ఖాతాదారులకు చిరు వ్యాపారులకు ఉపాధి కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని జీఎస్టీ పన్నును సరళీకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.