TV77తెలుగు కొండపల్లి:
బిజేపి విధానాలపై మక్కువతో కండువా కప్పుకున్న క్రీయశీల కార్యకర్తలు....!!!
బిజేపి లో చేరిన ట్రైబల్ లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షలు కూచిపూడి రమేష్, సమాచార హక్కు చట్టం న్యాయపోరాట కమిటీ జిల్లా అధ్యక్షులు మేకల భాను..!!
కొండపల్లి మున్సిపాలిటీ , ఇబ్రహీంపట్నం మండల బిజేపి నేతల ఆధ్వర్యంలో చేరికలు.!!!
పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన బిజేపి జిల్లా అధ్యక్షులు బబ్బూరి శ్రీరామ్..!!
కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల వేళ బిజేపి లోకి చేరికలు జరిగాయి. ఇప్పటివరకు వైసీపీ సానుభూతి పరులుగా కొనసాగిన క్రియాశీలక కార్యకర్తలు ఇప్పుడు బిజేపి కండువా కప్పుకొని పార్టీలో చేరారు. కొండపల్లి మున్సిపాలిటీ తో పాటు ఇబ్రహీంపట్నం మండల బిజేపి నేతల నేతృత్వం లో జిల్లా బిజేపి అధ్యక్షులు బబ్బూరి శ్రీరామ్ సమక్షంలో నేతలు బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.
రిపోర్టర్, సత్య.. మైలవరం