TV77తెలుగు రాజమహేంద్రవరం రూరల్:
ఆదివారం కడియం పోలీసు స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి అర్బన్ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, పోలీసు స్టేషన్ పని తీరు, కేసుల దర్యాప్తు, మండలంలో విలేజ్ విజిటింగ్, ప్రజాసమస్యలు పరిష్కారం, పిటిషన్ మేనేజ్మెంట్, డయల్ 100 కాల్స్‌పై పోలీసులు సత్వరం స్పందించడం గురించి మరియు ఇతర అంశాలపై సౌత్ జోన్ డిఎస్పీ యం.శ్రీలత మరియు సి.ఐ డి.రాంబాబు తో చర్చించారు. ఈ తనిఖీలో ఎస్పీ స్టేషన్ రికార్డులను పర్శిలించి, రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించినారు, అలాగే పాత యు ఎల్ కేసుల దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేయాలని తగు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. అనంతరం స్టేషన్ రిసెప్షన్ కౌంటర్, హెల్ప్ డెస్క్ లను పరిశీలించి, స్టేషన్ కు వచ్చు ఫిర్యాదుదారులతో గౌరవంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. పోలీస్ స్టేషన్ సిబ్బందితో మాట్లాడి వారికీ ఉన్న సమస్యలను అడిగి తెలుసు కొని, వాటి పరిష్కారానికి సి.ఐ కి తగు సూచనలు చేసినారు. స్థానిక ప్రజా సమస్యల పరిష్కారానికి, పోలీస్ స్టేషన్, డీఎస్పీ ఆఫీస్ గానీ, జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ని కలసి ఫిర్యాదు చేస్తే సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం అని ప్రజలకు తెలియజేశారు.