TV77తెలుగు రాజమహేంద్రవరం క్రైమ్:
గంజాయి అక్రమ రవాణా అరికట్టే ప్రణాళికలో భాగంగా సూపరిండెంట్
ఆఫ్ పోలీస్ రాజమండ్రి అర్బన్ మరియు జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో
(SEB). రాజమండ్రి వారి ఆదేశాల మేరకు ఎమ్. రాంబాబు, అసిస్టెంట్ ఎన్ ఫోర్స్ మెంట్
సూపరిండెంట్, ఎస్.ఐ.వి. రాజమండ్రి వారికి రాబడిన విశ్వసనీయ సమాచారం మేరకు మధ్యవర్తులతో
కలిసి లాలాచెరువు వద్దగల సిగ్నల్స్, పెట్రోల్ బంకు వద్ద వాహనములు తనఖీ నిర్వహించగా
09. 10.2021 సాయంత్రం సుమారు గం. 6.30 నిమిషములకు AP37X4243 నెల గల లారీ ని నిలుపుదల
చేసి పరిశీలించగా, అందులో అక్రమంగా గంజాయిను గుర్తించి వారిని ప్రశ్నించగా, వారు నర్సీపట్నం
నుంచి మహారాష్ట్ర తీసుకు వెళ్తున్నామని తెలిపినారు. లారీ నందు 47 బస్తాలలో సుమారు కోటి రూపాయల
విలువగల 1031,680 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని దానితోపాటు పై నెంబర్ కలిగిన లారీని
మరియు ఇద్దరు ముద్దాయిలను సయ్యద్ ఇబ్రహీం మరియు నకల్ కైలాస్ గైక్వాడ్ అరెస్టు చేయడమైనది.
ఇసుకను అధిక ధరలకు అమ్మినా, ఇసుక అక్రమ రవాణా చేస్తున్నా, నాటు సారాయి అమ్మకం,
తయారీ మరియు రవాణా చేసినా, కత్తీ కల్లు, కత్తీ మద్యం, బెల్టు షాపులు నిర్వహించినా, ఇతర రాష్ట్రాల
మద్యం అక్రమ అమ్మకాలు జరిపినా, కోడిపందాలు & జూదము ఆడించినా, గంజాయి అమ్మకం, రవాణా,
అక్రమ నిల్వలు, నిషేదిత గుట్కా నిల్వలు మరియు అమ్మకాలు చేసినా, ఇతర మత్తు పదార్థాల అమ్మకాలు,
వినియోగము, నిల్వలు కలిగి ఉన్నా రాజమహేంద్రవరం స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో కంట్రోల్
రూమ్ ఫోన్ నం. 9493206171 కు సమాచారము తెలియజేయగలరు. సమాచారము తెలిపిన వారి
వివరాలు గోషముగా ఉంచబడును.
ఈ దాడులలో ఎం.రాంబాబు, అసిస్టెంట్ ఎన్ ఫోర్స్ మెంట్ సూపరిండెంట్. ఎస్.ఇ.బి.
రాజమండ్రి, వి. రామకృష్ణ, ఇంటిలిజెన్స్ ఎస్. ఐ. ఎమ్. రామశేషయ్య , ఎస్. ఐ.. మరియు హెచ్.సి. లు,
కానిస్టేబుల్స్ ఎస్. ఎస్. వెంకన్న దొర, గంగాధర్ రావు, జి. బాపిరాజు, జి. క్రాంతి కిరణ్, డిప్యూటీ
తహసిల్దార్ ఆర్బన్, జి. శివ బాలాజీ, ఇన్స్ పెక్టర్, లీగల్ మెటలరాలజీ, వెయిట్ అండ్ మెజర్స్ ఆఫీసర్స్
మరియు వి. ఆర్. ఓ లు టీ దుర్గా భవానీ, ఎమ్. కృష్ణనాగలక్ష్మి పాల్గొన్నారు.