TV77తెలుగు రాజమహేంద్రవరం :
వామపక్ష పార్టీల ఆద్వర్యంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యవసర సరుకుల ధరలు తగ్గించాలని రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ధర్నాలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి టి.అరుణ్ , సీపీఐ జిల్లా కార్యదర్శి టి.మధు, సిపిఐ.ఎం.ఎల్ న్యూడెమోక్రసీ ఏ.వి.రమణ మాట్లాడుతూ ప్రజల ఆదాయాలు దిగజారిపోయింది సమయంలో పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు ప్రజాలజేబులు ఖాలిచేస్తున్నాయి అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్రోల్ 74 రూపాయలు అధికంగా ఉన్నాయి అని ఆందోళన చేసారని, నేడు దేశ ప్రధాని అయ్యి పెట్రోల్ రు..114 కు పెంచారని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరల రోజువారీ పెంపులను తీవ్రంగా ఖండించారు. వీటివల్ల ప్రజలపై అనూహ్యమైన రీతిలో భారాలు పడుతున్నాయని, దీనికి తోడు వంట గ్యాస్ ధర కూడా విపరీతంగా పెరిగిందని అన్నారు. రవాణా వ్యయం పెరిగి ఆహారం, కూరగాయలు, పాలు, ఇతర నిత్యావసరాల ధరల పెరుగుదలకు దారి తీస్తోందని అన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై పెంచిన కేంద్ర ఎక్సైజ్ సుంకాల మొత్తాలను ఉచిత వ్యాక్సినేషన్‌కు, మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సామాజిక పథకాల కోసం ఉపయోగిస్తున్నామని కేంద్ర మంత్రులు ప్రకటనలు చేస్తున్నారు. ప్రజలు అధిక ధరలు చెల్లిస్తుంటే, టీకాలు ఉచితం కాదు. వాటికోసం ప్రజలు తమకు తాము చెల్లిస్తున్నారని అనడం చాలా హాస్యాస్పదం అన్నారు. వ్యాక్సినేషన్ కోసం బడ్జెట్‌లో కేటాయించిన రూ.35 వేల కోట్లు ఏమయ్యాయి? కేంద్ర ప్రాయోజిత పథకాలకు, సబ్సిడీలకు బడ్జెట్‌లో ఇప్పటికే రూ.4లక్షల కోట్లు కేటాయించారు. ఈ డబ్బంతా ఎక్కడికి పోయింది? ఇది మోడీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టడానికి ప్రజలను కొల్లగొట్టడాన్ని ఖండించారు. సిపిఎం నాయకులు ఎస్.ఎస్.మూర్తి, టి.ఎస్.ప్రకాష్, పి.వెంకటేశ్వరావు, ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు నల్లా రామారావు, ఎడ్ల.లక్ష్మీ, భ్రమరాంబ, కె.జోజి, పి.తులసి, ఐ.సుబ్రహ్మణ్యం, బి.పవన్, రాజులోవ, కిరణ్, బి.పూర్ణిమారాజు పాల్గొన్నారు.