అసువులు బాసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటు పోలీసు బ్యాండ్ ప్రదర్శన వేడుక


 

TV77తెలుగు  రాజమహేంద్రవరం :

పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకొని, గురువారం పుష్కర్ ఘాట్,  రాజమహేంద్రవరం వద్ద పోలీసు బ్యాండ్ ప్రదర్శన వేడుకను అర్బన్ జిల్లా ఎస్పీ  ఐశ్వర్య రస్తోగి,  ప్రారంభించినారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరులైన పోలీసు అధికారులు, సిబ్బంది గౌరవార్థం మరియు వారి చేసిన అత్యున్నత త్యాగాలను స్మరించుకుంటు, అసువులు బాసిన పోలీసు శాఖ అధికారులు, సిబ్బంది కి ఈ ప్రదర్శన అంకితం.