కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్దంగా ఉండాలి


 ఎన్నికల నిర్వహణపై కసరత్తు...మున్సిపల్!!!


కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్దంగా ఉండాలి...!!!


ఎన్నికల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మున్సిపల్ అధికారులు...!!

TV77తెలుగు  కొండపల్లి :

జిల్లా కలెక్టర్ , గుంటూరు పురపాలక పరిపాలనా విభాగం సంయుక్త ఆధ్వర్యంలో  జరిగిన కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల సమీక్షా సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 29 వార్డుల్లో జరిగే పురపాలక సంఘం ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు... ఎన్నికల అధికారులు నియమావళిని పక్కాగా అమలు చేసే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు... కొండపల్లి మున్సిపల్ కమీషనర్ పర్వతనేని శ్రీదర్ నేతృత్వం లో అధికారులకు సమీక్షా సమావేశం జరిగింది.. ఎన్నికల నోటిఫికేషన్ కు సంబందించి మిగిలిన అన్ని మున్సిపాలిటీలకు కలిపి మొత్తం ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమీషన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది... వచ్చే వారం లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.

రిపోర్టర్.సత్య ...మైలవరం