రాజమండ్రి అర్బన్ అడిషనల్ ఎస్పీ లతామాధురి పిసి కామెంట్స్
TV77తెలుగు రాజమండ్రి :
రాజమహేంద్రవరం రేపు జరిగే హుక్కుంపేట పంచాయతీ బాలాజీపేట సెంటర్ లో, బహిరంగ సభకు జనసేన పార్టీ నేతలు అనుమతి అడిగారు.సుమారు 20 వేల మంది సభకు తరలివచ్చే అవకాశం ఉంది.కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి . అడిషనల్ ఎస్పీ లతామాధురి, అన్నారు .బాలాజీపేట ప్రాంతంలో అంతమందితో సభ నిర్వహించడం వల్ల ఇబ్బందులు వస్తాయి.సభా వేదిక మార్చుకోవాలని ఇప్పటికే జనసేన పార్టీ ప్రతినిధులకు సూచించాము.వారి నుంచి ఇంకా ఎటువంటి సమాచారం రాలేదు.బాలాజీపేటలో అయితే సభకు అనుమతి ఇవ్వలేదు.జనసేన పార్టీ తరపున శ్రమదానానికి అనుమతి కోరలేదు. అని అడిషనల్ ఎస్పీ లతామాధురి అన్నారు.