కొత్తగెట్ మోడల్ స్కూల్ మధ్యాహ్న భోజనం అమలును పరిశీలించిన రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ పూలగంగు రాణి
TV77తెలుగు మైలవరం:
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు పౌష్ఠిక ఆహారం అందించడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర గ్రీనరీ బ్యుటిఫికేషన్ డైరెక్టర్ పూలగంగు రాణీ తెలిపారు.కొత్తగేట్ ప్రభుత్వ మోడల్ స్కూల్ లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం పథకాన్ని పాఠశాల హెచ్ ఎం భాగ్యమ్మ తో కలిసి పరిశీలించారు. నాడు నేడు పథకం ద్వారా రాష్ట్రం లోని ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చేసిందని తెలిపారు. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్నారని ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ప్రజలకు విలువైన సేవలు అందించడమే ధ్యేయంగా పని చేస్తున్నట్లు రాణీ స్పష్టం చేశారు.
రిపోర్టర్
సత్య.
మైలవరం