ఆలిండియా వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య నేషనల్ మీటింగ్


 జాతీయ, ఆంధ్ర ,తెలంగాణ శాఖల కమిటీలు  ఏర్పాటు


ఆంధ్రాలో అక్రిడేషన్ కార్డ్స్ మంజూరు కోసం సమైక్య పోరాటం


TV77తెలుగు  హైదరాబాద్ :

జర్నలిస్టులకు వృత్తి గుర్తింపునకు, గౌరవానికి  ప్రతీకగా నిలిచే  అక్రిడేషన్ కార్డులను గత మూడేళ్లుగా మంజూరు చేయడం లేదని ఆలిండియా వర్కింగ్ జర్నలిస్ట్స్ సమైక్య నాయకులు తీవ్రంగా విమర్శించారు.

సమైక్య ఆధ్వర్యంలో హైదరాబాద్లో రెండు రాష్ట్రాల జర్నలిస్టులతో జాతీయ స్థాయి సమావేశం. గురువా రం సన్ సైన్  రియల్ ఎస్టేట్ వెంచర్ ఆవరణలో జరిగింది. 

ఈ సమావేశానికి అధ్యక్షుడిగా వ్యవహరించిన సమాఖ్య జాతీయ అధ్యక్షుడు సిహెచ్ రామకృష్ణ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టుల కు ప్రభుత్వం అక్రిడేషన్ కార్డులను ఇచ్చేంతవరకు సమైక్య ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. 

అనంతరం ఆంధ్ర తెలంగాణ జాతీయ కమిటీలకు కార్యవర్గాలు ఎన్నుకున్నారూ. ఈ కార్యక్రమంలో

చల్లగుండ్ల రామకృష్ణ ,  విష్ణు, రాజు, గుమ్మడి గోపాలకృష్ణ,  మురళి కృష్ణ,  తదితరులు పాల్గొన్నారు.