TV77తెలుగు రాజమహేంద్రవరం:
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం పాలైన ఘటన రాజమహేంద్రవరం ఇస్కాన్ టెంపుల్ సమీపంలో చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి ఆల్కాట్ గార్డెన్స్ గోదావరి గట్టు మీదుగా ద్విచక్రవాహనంపై ఓ యువకుడు, యువతి వేగంగా వస్తున్నారు. వారి వాహనం ఇస్కాన్ ఆలయం సమీపంలో అదుపు తప్పడంతో ఇద్దరు కింద పడ్డారు. ప్రమాదంలో యువకుడుకు తీవ్ర గాయాలై రక్తస్రావం కావడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. గాయాలపాలైన యువతిని స్థానికులు 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఆమె తనపేరు చాందిని, తనది లింగం పేట అని వైద్య సిబ్బందికి తెలిపింది. ఆ యువకుడు వివరాలు తెలియలేదు. ఆమె కోలుకుంటేనే గానీ పూర్తి వివరాలు చెప్పలేమని పోలీసులు చెబుతున్నారు. టూ టౌన్ పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని యువకుడి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.