బాడుకో విన్యాసాలు మాని ప్రజాసమస్యలపై దృష్టి పెట్టండి అధికార, ప్రతిపక్ష పార్టీలకు జనసేన విజ్ఞప్తి

బాడుకో విన్యాసాలు మాని ప్రజాసమస్యలపై దృష్టి పెట్టండి అధికార, ప్రతిపక్ష పార్టీలకు జనసేన విజ్ఞప్తి

TV77తెలుగు   రాజమహేంద్రవరం :


గత రెండున్నరేళ్లుగా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా బాడుకో విన్యాసాలు చేస్తున్నాయని జనసేన రాజమండ్రి నియోజకవర్గ కన్వీనర్ అత్తి సత్యనారాయణ విమర్శించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు శనివారం నగరంలోని తాడితోట జంక్షన్ వద్ద ఏర్పడిన గోతులను జనసైనికులు వీర మహిళలు శ్రమదానం చేసి గోతులను పుర్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసిపి పార్టీ ప్రజా సమస్యలను గాలికి వదిలేసింది అని రాష్ట్రాన్ని అరాచకవాదులు చేతుల్లో పెట్టిందని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీని పార్టీ నాయకులను టార్గెట్ చేసుకొని అధికార పార్టీ నాయకులు బాడుకో కో విన్యాసాలు చేస్తున్నారని ఇకనైనా ఇలాంటి మానుకోవాలని విజ్ఞప్తి చేశారు లేదంటే ప్రజల తరఫున జనసేన పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీనివాస్ శ్యాంసుందర్ భాగ్యలక్ష్మి ఇందిరా, దాసరి పాండురంగారావు, కెల్లా జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.