రూ, రెండు కోట్ల విలువైన గంజాయి స్వాధీనం నలుగురు వ్యక్తుల అరెస్ట్

TV77తెలుగు కాకినాడ:
  పద్ధతులు పాటిస్తున్న గంజాయి స్మగ్లర్లు - బోర్ వెల్ లారీ లో ప్రధానంగా గంజాయి అక్రమ రవాణా పై అనేక చర్యలు తీసుకోవడం రవాణా దారులపై కేసులు పెట్టడం జరిగింది. ఈ పరంపర లో జిల్లా ఎస్ పి రవీంద్ర బాబు కు రాబడిన సమచారం ప్రకారం వినూత్న పద్దతిలో ఒక బోర్ వెల్ లారిలో రవాణా చేస్తున్న గంజాయి ని పట్టుకోవడం జరిగింది. జిల్లా SP ఆదేశాల మేరకు, పెద్దాపురం డి.ఎస్.పి. శ్రీనివాస రావు, ఎస్ బి డి ఎస్ పి .అంబికా ప్రసాద్ ల పర్యవేక్షణలో తుని రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ .కిషోర్ బాబు, తొండంగి పిఎస్ ఎస్.ఐ. మోహన్ కుమార్ వారి సిబ్బంది కలసి శనివారం సాయంత్రం తొండంగి మండలం అద్దరిపేట గ్రామ శివారు బీచ్ రోడ్ లో కాపు కాసి గంజాయి రవాణా చేస్తున్న బోర్ వెల్ లారీని పట్టుకోవడం జరిగింది. గంజాయి రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులును అరెస్ట్ చెయ్యడం జరిగింది. బోర్ వెల్ లారీ వెనుక ఉండి పెద్ద జనరేటర్ బాక్స్ లో గంజాయిని తరలిస్తున్నారు. అరెస్ట్ చేసిన ముద్దాయిలు ఇమ్మంది వీర వెంకట రమేష్, తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా, అంబటి రాజు, గంటిపల్లి పాలెం గ్రామము, కొత్తపేట మండలం, తూ.గో.జిల్లా.విప్పర్తి శామ్యూల్, గంటిపల్లి పాలెం గ్రామము, కొత్తపేట మండలం, తూ.గో.జిల్లా.గూటం రాజు కుమార్, S/0 వర ప్రసాద్, గంటిపెద్ది పేట గ్రామము, కొత్తపేట మండలం, తూ.గో. జిల్లా, ఉన్నారు. పరారీ లో ప్రధాన ముద్దాయిలు . ఇమ్మంది మధు, తణుకు, , ఇమ్మంది సత్యనారాయణ మూర్తి, తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా, ఉన్నారని డిఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఆస్తి:
 1) 1,000 కేజీల గంజాయి (మార్కెట్ విలువ సుమారు రెండు కోట్ల రూపాయలు )
 2) AP 29 BR 5524 నెంబర్ గల అశోక్ లే ల్యాండ్ బోర్ వెల్ లారీ
 3) AP 05 CZ 0887 నెంబర్ గల హీరో హోండా గ్లామర్ మోటార్ సైకిల్
 4) నగదు రూ.30,000-