సరైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని గుంటుపల్లి ఖాజీపేట అంబేత్కర్ నగర్ వాసులు వినతి

వార్డుల అభివృద్ధి కోసం...!! 
 
ఎంపిపి గారు గుంటుపల్లి డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేయండి....!! 
 
సరైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని గుంటుపల్లి ఖాజీపేట, అంబేత్కర్ నగర్ వాసులు వినతి....!! 
 
నూతంగా బాధ్యతలు స్వీకరించిన పాలడుగు జ్యోత్న్స కు మీడియా ద్వారా విజ్ఞప్తి చేసిన స్థానిక ప్రజలు...!!

TV77తెలుగు ఇబ్రహీంపట్నం:
 ఇబ్రహీంపట్నం మండల పరిధిలో మేజర్ పంచాయితీ గా కొనసాగుతున్న గుంటుపల్లి గ్రామం లోని కొన్ని వార్డుల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది.. గుంటుపల్లి , ఖాజి పేట, అంబేత్కర్ నగర్ ప్రాంతాల్లో సరైన మురుగు నీటి పారుదల వ్యవస్థ లేక స్థానిక ప్రజలు తీవ్ర అస్వస్థతలు పడుతున్నారు.. ఖాజీ పేట జెండా చెట్టు బజార్ లో గత కొన్నేళ్లుగా సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగు నీరు నిలవ ఉంటుంది.. అలానే అంబేత్కర్ నగర్ ప్రాంతం లోని ఒక కాళీ స్థలం లో చెత్త పేరుకు పోయి మురునీరు నిల్వ ఉంటుంది.. ఫలితంగా దోమలు చేరి దుర్గంధం వ్యాప్తి చెందుతుంది.. దోమల వ్యాప్తి కారణంగా విష జ్వరాల వీజృభణ తో స్థానిక ప్రజలు ఆరోగ్య పరంగా, ఆర్థికంగా తీవ్రంగా నష్టోతున్న పరిస్థితి నెలకొంది... ఈ నేపథ్యంలో లో నూతనంగా భాద్యతలు చేపట్టిన మండల పరిషత్ ప్రెసిడెంట్ పాలడుగు జ్యోత్స్న ఈ సమస్యలపై దృష్టి సారించాలని స్థానికులు మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు.... 
  సత్య..
రిపోర్టర్