శాటిలైట్ ఛానల్ కెమెరామెన్ ల హవా కట్టడి చేయాలి
నేషనల్ వెబ్ అండ్ యూట్యూబ్ చానళ్ల ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.స్.బి సురేష్
TV77తెలుగు రాజమహేంద్రవరం:
రాజమహేంద్రవరం జాతీయ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ ఎక్కడా లేని విధంగా రాజమండ్రి నగరంలో శాటిలైట్ ఛానల్ కెమెరామెన్ ల అరాచకం,హవా కొనసాగుతుందని నేషనల్ వెబ్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఓనర్ల ల అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు వి.స్.బి సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆదివారం వరంగల్ లో అసోసియేషన్ రాష్ట్రాల వెబ్ అండ్ యూట్యూబ్ ఛానల్ ల ప్రతినిధుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో సురేష్ మాట్లాడుతూ శాటిలైట్ ఛానల్ ల పనితీరు ఏ విధంగానూ తక్కువ కాకుండా వెబ్ అండ్ యూట్యూబ్ ఛానల్ లు వార్తలను కవర్ చేస్తున్నాయని అన్నారు. అయితే శాటిలైట్ ఛానల్లకు పరిధి పరిమితులు ఉంటాయని దాంతో వార్తా కథనాలు 90% టెలికాస్ట్ కావని 100% వెబ్ అండ్ యూట్యూబ్ ఛానల్ లు టెలికాస్ట్ అవుతాయని పేర్కొన్నారు. ఈ కారణం చేతనే శాటిలైట్ ఛానల్ కెమెరా మెన్ లు యాజమాన్యాలు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ వెబ్ అండ్ యూట్యూబ్ ఛానల్ లోగోలను ప్రదర్శించకుండా అడ్డుకుంటున్నాయని తీవ్రంగా మండిపడ్డారు. వివేకా కుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ ఫైబర్ నెట్ లిమిటెడ్ లోనూ నెలకు లక్ష రూపాయలు ఫీజులు చెల్లించి టెలికాస్ట్ అవుతున్న చానళ్ల లోగోలను రాజమండ్రిలో ప్రదర్శించకుండా అడ్డుకోవడం కొన్ని శాటిలైట్ చానళ్లలో పాతుకుపోయిన కెమెరా మేన్ ల దౌర్జన్యం జరుగుతుందని అన్నారు ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర సమాచార శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్లు, శాటిలైట్ ఛానల్ ల కెమెరా మెన్ ల దౌర్జన్యాన్ని నియంత్రించాలని,వెబ్ అండ్ యూట్యూబ్ చానళ్లను గుర్తించాలని సమావేశం తీర్మానించినట్లు సురేష్ తెలిపారు. ఈ సమావేశంలో ఉభయ రాష్ట్రాల నుంచి సుమారు 150 మంది ఆయా ఛానల్ ప్రతినిధులు పాల్గొన్నారు.