టూరిస్ట్ బస్సు నుండి పొగలు

టూరిస్ట్ బస్సు నుండి పొగలు

డ్రైవర్ అప్రమత్తంతో తప్పిన పెను ప్రమాదం

పరుగులు తీసిన ప్రయాణికులు
TV77తెలుగు కొత్తపేట:
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజక వర్గం ఆలమూరు మండలం మడికి జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం ఓ టూరిస్టు బస్సు నుండి దట్టమైన పొగలు రావడంతో అది గమనించిన బస్సు డ్రైవర్ అప్రమత్తమై బస్సును ఓ ప్రక్కకు ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు పరుగులు తీశారు. వారి వివరాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నుండి తూర్పుగోదావరి జిల్లా మిర్తిపాడు వద్ద జరిగే ఓ ప్రార్థన కార్యక్రమానికి సుమారు 50 మంది భక్తులు వెళ్లి ప్రార్థన ముగించుకుని తిరిగి ప్రయాణంమై వస్తుండగా మడికి వద్దకు వచ్చేసరికి బస్సు నుండి దట్టమైన పొగలు రావడంతో బస్సును డ్రైవర్ అప్రమత్తమై ఆపేసారు. కాగా పెను ప్రమాదం నుంచి బయటపడ్డ ప్రయాణికులు వేరే వాహనాల్లో వారి గమ్యస్థానాలకు వెళ్ళిపోయారు. కొద్దిసేపటికి బస్సు నుండి వచ్చే పొగలు ఆగడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా వెనుక ఉన్న చక్రాలలో సాంకేతిక లోపం వల్లే దట్టమైన పొగలు వ్యాపించాయని పలు వాహనాల డ్రైవర్లు తెలిపారు.