మైలవరం రాజకీయ మాటల యుద్ధం మళ్ళీ మొదలైంది....!!!
వైసీపీ , టిడిపి మద్య కొనసాగుతున్న విమర్శల పర్వం.....!!!
మున్సిపల్ ఎన్నికల కోసమే రాజకీయ విమర్శలకు ఆద్యం పోస్తున్నారు అంటూ పలువురు వాఖ్య....!!!
TV777తెలుగు మైలవరం:
కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల చివరి వారంలో వస్తుందని విస్తృత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మైలవరం రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కినట్లు కనిపిస్తోంది. కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు అత్యంత కీలకం కావడంతో నేతలు ఆది నుండి వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో టిడిపి, వైసీపీ నేతలు రాజకీయ విమర్శలకు ఆద్యం పోస్తునట్లు కనిపిస్తోంది.గడిచిన రెండు, మూడు రోజుల వ్యవధిలో జరిగిన సమావేశాలు అందుకు ఉదాహరణ గా నిలుస్తున్నాయి. ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సంసిద్ధం గా ఉండాలి అంటూ చేసిన వాఖ్యలు ఎన్నికల వేడినీ రాజేసింది. అదే సమావేశంలో ఎమ్మెల్యే వసంత పై అవినీతి ఆరోపణలతో విరుచుకుపడిపోయారు. దీనికి కౌంటర్ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ సైతం ఆ ఆరోపణలు తిప్పికొడుతూ టిడిపి ఐదేళ్ల అసమర్థ పాలన ఎండగడుతూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అయితే జరుగుతున్న రాజకీయ పరిణామాలు నిశితంగా పరిశీలిస్తున్న కొండపల్లి మున్సిపాలిటీ ప్రజలు ఇదంతా ఎన్నికల కోసం అంటూ ఒక నిర్ధారణకు వస్తున్న పరిస్థితి. ఇప్పటికే టిడిపి నేతలు ఎన్నికల అస్త్రాలను సిద్ధం చేసుకొని అధికార పార్టీనీ ఇరుకున పెట్టే విదంగా తెర వెనుక వ్యూహ రచన చేస్తున్నట్లు కనిపిస్తోంది.. అటు అధికార పార్టీ నేతలు సైతం ప్రత్యర్థులు ఎవరూ ఊహించని వ్యూహం తో అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏది ఏమైనా ఎన్నికల వేడి అయితే రగిలినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఘనంగా జరిగిన ఆసరా పై. టిడిపి చేసిన ధ్వంస రచన ఏంటి ?? దానిని తిప్పి కొట్టిన అస్త్రం ఏమిటి ??
తరువాత శీర్షిక లో.
రిపోర్టర్,
సత్య. మైలవరం