టాటా మ్యాజిక్ అదుపుతప్పి బోల్తా తండ్రి కూతురు మృతి


 TV77 తెలుగు దేవరపల్లి:
పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి హైవేపై  టాటా మ్యాజిక్  అదుపుతప్పి బోల్తా  పడింది. ఈ ప్రమాదంలో టాటా మ్యాజిక్‌లో ప్రయాణిస్తున్న తండ్రి, కూతురు మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. మృతులు తూర్పుగోదావరి జిల్లా శరభవరం గ్రామానికి చెందిన లోకా నాగు (30), లోక వీరలక్ష్మి(3)గా గుర్తించారు. విజయవాడ అమ్మవారి దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది.