మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది విద్యార్థులతో ఎస్సై శివ శంకర్ రావు

TV77తెలుగు ఆత్మకూరు:
క్రికెట్ బెట్టింగ్ లకు,ఈవ్ టీజింగ్ లకు పాల్పడి మీ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని అంటూ విద్యార్థులకు దిశ యాప్ పై అవగాహన ఏర్పరచుకొని మీరు ఏదైనా సమస్య ఎదుర్కొన్న సమయంలో రక్షణ పొందవచ్చని విద్యార్థినులకు సూచించారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎస్ఐ శివ శంకర్ రావు. ఆత్మకూరు పట్టణంలోని పాఠశాలలు, కాలేజీలు వదిలిన తర్వాత మున్సిపల్ బస్టాండ్ వద్ద కు చేరుకున్న విద్యార్థులతో ఆత్మకూరు ఎస్ఐ శివ శంకర్ రావు మాట్లాడారు.మీరు ప్రవర్తించిన తీరు వల్లనే మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది అంటూ వారికి తెలిపారు.. విద్యార్థి దశలో చక్కగా చదువుకొని మీ భవిష్యత్తు దిద్దుకోవాలని ఇతర ఆలోచనలతో పెడదారి పెట్టవద్దని సూచించారు. మీకు ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి ఎదురైనా వెంటనే తనకు ఏ సమయంలోనైనా ఫోన్ చేయవచ్చని వారికి తన ఫోన్ నెంబర్ ఇచ్చారు ఎస్ఐ శివశంకరరావు.