ఏసీబీ వలలో గ్రామ రెవెన్యూ అధికారి


 
TV77తెలుగు గంగవరం:
తూర్పు గోదావరి జిల్లా, జగ్గంపాలెం. గంగవరం మండలము లో ఎం. సూరమ్మ, గ్రామ రెవెన్యూ అధికారి, జగన్నాధ రావు,  తన కుటుంబ సబ్యులకు సంబందించిన 7 ఎకరాల భూమి ని ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి వివరాలు ఆన్లైన్ లో ఎంట్రీలు వేయుటకు గాను రు. 10,000 లంచంగా డిమాండ్ చేసినారని రాజమండ్రి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు ఇచ్చినారు. ఈ ఫిర్యాదు మేరకు గురువారము    మధ్యాహ్నం 1.10 గంటలకు నిందిత అధికారిని అయిన ఎం. సూరమ్మ, గ్రామ రెవెన్యూ అధికారి పిర్యాది వద్ద నుండి రు. 10,000 లంచంగా అడిగి తీసుకుంటుండగా ఆమెను గంగవరం తహసిల్దార్ కార్యాలయం వద్ద ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. నిందిత అధికారిని రాజమండ్రి 3 వ ADJ cum ఏసీబీ స్పెషల్ జడ్జి కోర్టులో రిమాండ్ కొరకు హాజరు పరచనున్నారు. కేసు దర్యాప్తులో ఉన్నది.