ట్రాన్స్‌ఫార్మర్‌ మరమ్మతు కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం

TV77తెలుగు సిద్దిపేట: గజ్వేల్‌లో ట్రాన్స్‌ఫార్మర్‌ మరమ్మతు కేంద్రంలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది.దీంతో కేంద్రంలో ఒక్కసారిగా మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు.ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు.అగ్ని ప్రమాదంలో సుమారు రూ.50 కోట్ల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.