సమయం లేదు నాయక
iraila 19, 2021
మండల కొలువుల సమయం ఆసన్నమైంది...!!!
మండల ఎంపిపి స్థానం పాలడుగు జ్యోత్న్స...??
వైస్ ఎంపిపి పదవి ఎవరిని వరిస్తుందో...!!
రాజకీయ, సామాజిక సమీకరణాల పై సర్వత్రా చర్చ...!!!
TV77తెలుగు ఇబ్రహీంపట్నం:
ఎంపిటిసి, జడ్పీటిసి ఎన్నికలకు సంబంధించి నేటితో జరగాల్సిన తంతు అంతా జరిగిపోయింది. రావాల్సిన ఫలితాలు రానే వచ్చాయి.ఇక మండల పరిషత్ లో కొలువులే మిగిలాయి. ఎన్నికలు ఏక పక్షంగా జరిగినప్పటికీ గెలుపొందిన అభ్యర్థుల మెజారిటీ చూసిన తరువాత పోటీ ఉన్నా సరే గెలుపు వైసీపీ అభ్యర్థులదే అయ్యేది అనే వాదన బలంగా వినిపిస్తోంది. ఫలితాల తరువాత సాధారణంగా మండల ఎంపిపి, వైస్ ఎంపిపి, కో ఆప్షన్ సభ్యుల ఎంపిక మొదలవుతుంది. అయితే అందుకు సంబంధించి ఇప్పటికే ఎంపిపి ల ఎంపిక పై తేదీలను సైతం ఎస్ ఈ సి ఖరారు చేసింది. ఈ నెల 24 వ తేదీన జరిగే ఎంపిపి ప్రమాణ స్వీకారం లో ఎవరికి ఎంపిపి పదవి, ఎవరికి వైస్ ఎంపిపి పదవి మిగతా సభ్యులు ఎవరు అనే అంశం పై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం మండల పరిషత్ పాలకవర్గం ఎవరా అన్న దానిపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఇబ్రహీంపట్నం మండల ఎంపిపి అభ్యర్ధిగా పోటీలోకి దిగిన పాలడుగు జ్యోత్స్న ఇప్పటికే ఎంపిపి అభ్యర్థిగా ప్రమాణస్వీకారం చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఎంపిపి విషయం లో మండల ప్రజలకు ఒక క్లారిటీ ఉన్నప్పటికీ వైస్ ఎంపిపి ఎవరనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఎంపిపి పదవి కి జనరల్ రిజర్వ్ కాగా వైస్ ఎంపిపి పదవికి ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ లకు దక్కే అవకాశాలు ఉన్నాయి. అయితే మొత్తం 11 ఎంపిటిసి స్థానాలకు గాను మొత్తం 10 స్థానాలను వైసీపీ కైవసం చేసుకొని మండల పరిషత్ ను తన ఖాతాలో వేసుకుంది. అయితే 10 స్థానాల్లో ఒకరు ఎంపిపి రేసులో ఉండగా మిగిలిన 9 స్థానాల్లో 3 జనరల్ కేటగిరీ, 4 ఎస్సీ కేటగిరీ, 1 ఎస్టీ, 1బీసీ కేటగిరీ లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. మండల ప్రెసిడెంట్ పదవి జనరల్ కు కేటాయించడం తో సమాజిక సమీకరణాల అంచనా ప్రకారం మిగిలిన 3 స్థానాల్లో పోటీ చేసిన జనరల్ అభ్యర్థులకు వైస్ ఎంపిపి పదవి దక్కే అవకాశం లేదు అనేది స్పష్టం అవుతుంది. మైనారిటీలు ఎవరు పోటీ లో లేక పోవడం తో ఇక మిగిలిన 4 ఎస్సీ అభ్యర్దులు, 1 ఎస్టీ, ఒక బిసి అభ్యర్థికి వైస్ ఎంపిపి పదవి దక్కే ఛాన్స్ ఉంది. మిగిలిన ఆ ఆరుగురిలో ఒకరికి వైస్ ఎంపిపి పదవి వచ్చే అవకాశం ఉంది అనేది అంచనా వేయవచ్చు. ఈ నేపథ్యంలో ఆ ఆరుగురు ఎవరు వారి మెజారిటీ ఎంత అనేది ఒక సారి చూద్దాం.
దాములూరు గ్రామ ఎంపిటిసి స్థానానికి పోటీ చేసి అభ్యర్థి ఉప్పులురు నాగేశ్వరరావు.(ఎస్సీ) 425 మెజారిటీ తో గెలుపొందారు.
కాచావరం గ్రామం నుండి ముద్దంగుల రంగస్వామి (బీసీ) 512 మెజారిటీ తో విజయం సాధించారు.
కేతనకొండ 1.స్థానం నుండి పులి సువర్ణ రాజు (ఎస్సీ) 398 కి పైగా మెజారిటీ తో విజయం సాధించారు.
కోటికలపుడి గ్రామం నుండి బండి నాగమణి (ఎస్సీ) 314 మెజారిటీ తో విజయం.
జూపూడి గ్రామం నుండి బాణవతు నాగ బాలమ్మ (ఎస్టీ) 1024 బంపర్ మెజారిటీ తో గెలుపొందారు.
ఈలప్రోలు గ్రామం నుండి కొర్రపాటి జయమ్మ (ఎస్సీ) 208 మెజారిటీ సాధించి విజయం సాధించారు. వీరంతా వారి వారి పరిధిలో ఘన విజయం నమోదు చేసి మండల పరిషత్ లోకి అడుగు పెట్టనున్నారు. అయితే ఈ ఆరుగురు సభ్యల నుండి ఒకరికి వైస్ ప్రెసిడెంట్ పదవికి అర్హత సాధించే అవకాశం ఉంది. అయితే రాజకీయ అంచనాలు, సామాజిక సమీకరణాల నేపథ్యం లో ఆ పదవి ఎవరినీ వరిస్తుందో ఈ నెల 24వ తేదీ వరకు ఆగాల్సిందే.
సత్య..
రిపోర్టర్
మైలవరంi>