నో డ్యామేజ్.... ఇమేజ్ పదిలం...!!!
iraila 20, 2021
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలలో కనిపించిన ఎమ్మెల్యే వసంత ఇమేజ్ జోష్....!!!
ప్రత్యర్థులు పోటీలో ఉన్నా, ఏకపక్షంగా ఎన్నికలు జరిగినా ఫలితాలు మాత్రం " సేమ్ టూ సేమ్ "......!!!
పంచాయితీ అయినా, మండల పరిషత్ అయినా కొనసాగిన అభ్యర్థుల దూకుడు...!!!
అభ్యర్థుల గెలుపుకు కారణం ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సుస్థిర పాలన, ఎమ్మెల్యే వసంత నిస్వార్థ పాలన అంటూ వైసీపీ వాఖ్య...!!
జరగబోయే కొండపల్లి మున్సిపల్ ఎన్నికలలో సైతం ఇదే జోష్ ఉంటుందని వైసీపీ ధీమా...!!!
TV77తెలుగు మైలవరం:
మైలవరం నియోజకవర్గ రాజకీయ చరిత్రలో ఎమ్మెల్యే గా వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గెలుపొందడం ఒక అధ్యాయం కాగా తదనంతరం వెలువడిన ఫలితాలు మొత్తం ఒక చరిత్ర గానే వర్ణించవచ్చు... గతంలో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అన్నట్లు జరగగా 60 స్థానాలకు గాను 55 పంచాయితీలు సాధించి విజయ ఢంకా మోగించారు... అలానే ఎంపిటిసి ,జడ్పీటిసి ఎన్నికల్లో సైతం అదే దూకుడు కొనసాగిస్తూ 73 ఎంపిటిసి స్థానాలకు గాను 69 స్థానాలు గెలుపొంది చారిత్రక విజయాలు నమోదు చేశారు.. ఇక జడ్పీటిసి అయితే పోటీ చేసిన స్థానాల్లో గెలుపు ఢంకా బజాయించి ఎమ్మెల్యే వసంత ఇమేజ్ గ్రాఫ్ పదిలం చేశారు... మైలవరం నియోజకవర్గ రాజకీయ చరిత్రలో తొలిసారిగా నమోదైన చారిత్రక విజయాలు ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సుస్థిర పాలన, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ నిస్వార్థ పాలనకు నిదర్శనమని వైసీపీ కేడర్ బలంగా విశ్వసిస్తోంది.. ఇటీవల జరిగిన రాజకీయ గొడవలు, ఎమ్మెల్యే వసంత పై ఆరోపణల తో ఎమ్మెల్యే వసంత ఇమేజ్ డ్యామేజ్ అయిందని ప్రతిపక్ష టిడిపి భావించింది..కానీ నిన్న వెలువడిన ఫలితాలు అంచనా వేస్తున్న వైసీపీ శ్రేణులు ఎమ్మెల్యే వసంత ఇమేజ్ కు ఢోకా లేదని చెపుతున్న పరిస్థితి.. మండల పరిషత్ ఎన్నికల్లో టిడిపి అసలు పోటీ లేదని ఇది అసలు గెలుపు కాదని ప్రతిపక్షం వాదిస్తున్నప్పటికి నమోదైన మెజారిటీ నీ పరిగణం లోకి తీసుకున్న వైసీపీ పోటీలో ఉన్నా ఫలితాలు ఇలానే ఉండేవని తేల్చి చెబుతున్నారు.అసలు పోటీలో లేము అని చెబుతూనే రెండు మూడు స్థానాల్లో ఎలా గెలిచారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు... ఏది ఏమైనా ఎమ్మెల్యే వసంత పడిన కష్టానికి ప్రజలు ఇచ్చిన ప్రతిఫలంగా భావిస్తున్నట్లు వైసీపీ చెబుతోంది... ఇక మైలవరం లో ఎలాంటి ఎన్నికలు అయినా ఎమ్మెల్యే వసంత మానియాలో కొట్టుకుపోవడం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల పై గ్రౌండ్ రిపోర్ట్
సత్య..
రిపోర్టర్
మైలవరం