లింగ నిర్ధారణ పరీక్షల పై ప్రజల్లో అవగాహన పెంచాలి రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ ఇలాక్కియా

TV77తెలుగు రాజమహేంద్రవరం: సమాజంలో ఆడ పిల్లల పట్ల వివక్షత నిర్మూలన, ఆడ పిల్లలను గర్భస్త పిండ దశలోనే భ్రూణ హత్యల ద్వారా అంత మొందించకుండా తీసుకొని వచ్చినదే గర్భస్త పిండ పరీక్షలు మరియు గర్భస్త శిశు పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం-1994 అని సబ్ కలెక్టరు డివిజన్ స్థాయి పి.సి -పిఎడిటి సలహా కమిటీ చైర్మన్ ఇలాక్కియా అన్నారు. శుక్రవారం స్థానిక సబ్ కలెక్టరు వారి కార్యాలయంలో గర్భస్త పిండ పరీక్షలు మరియు గర్భస్త పిండ లింగ నిర్ధారణ నిషేద చట్టం-1994 అమలుతీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల కాలములో గణాంకాలు పరిశీలిస్తే ఆడపిల్లల నిష్పత్తి తగ్గిందని రుజువు అవుతోందన్నారు. సామాజిక ఆర్ధిక పరిస్థితులు కాలానుగుణంగా వస్తున్న మార్పులువల్ల దంపతులకు మగ పిల్లాడు పుడితే బాగుంటుందని వంశోధారకుడు అవుతాడని భావించడం వల్లే నిర్దయతో ఆడ పిల్లల భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారన్నారు.. స్త్రీ పురుష లింగ నిష్పత్తి సమానంగా ఉంటేనే సమాజం అన్ని విధాలుగా అభివృద్ధి సాదించగలదన్నారు. మగ పిల్లలే పుట్టాలన్న ఆలోచనలో పూర్తిగా మార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు. ఆడ పిల్లల పట్ల వివక్షతను తొలగించడానికి మరియు ఆడ మగ సమానమేనన్న భావన పెంపొందించడానికి గ్రామ వాలంటీర్లు, గ్రామ కార్యదర్శులు, స్వయం సహాయక సంఘాలు, మెప్మా సంఘాలు సహకారంతో క్షేత్రస్థాయిలో వారి విధులలో భాగంగా ఈ అంశాలను చేర్చి, సమాజ హితానికి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొనిరావాలన్నారు. చట్టాన్ని ఉల్లంఘించి గర్భస్త శిశు పిండ లింగ నిర్ధారణ విషయాన్ని సైగలు, కోర్టు లేదా బహిర్గతంగా ప్రకటించిన ఆల్ట్రా సౌండ్ స్కానింగు కేంద్రాల నిర్వహకులకు నిషేదిత అంశాలకు అనుగుణంగా సెక్షన్ 22, 23, 24 ప్రకారం శిక్షలు బనాయించి జరిమానాలు విధించాలన్నారు. ప్రొసీక్యూషన్ విభాగం స్త్రీ శిశు సంక్షేమ శాఖ, ప్రజారోగ్య శాఖలవారు ఆడ పిల్లలపట్ల వివక్షతను నిర్మూలించే దిశగా పలు చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆడపిల్లలను ప్రోత్సాహించే దిశగా పలు పధకాలు ప్రవేశపెట్టి వివక్షతను నిర్మూలించే దిశగా పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నాయన్నారు. స్త్రీ పురుష సమానత్వాన్ని సాధించడానికి ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు. ఈ చట్టాన్ని సక్రమంగా అమలు చేయకపోతే ఆడ పిల్లలపట్ల వివక్షతకు దారితీయడమే కాక వాస్తవానికి మనిషి మనుగడకే ప్రశ్నార్ధకంగా మారుతుందన్నారు. వయస్సు రీత్యా 35 సంవత్సరాలు నిండి గర్భం దాల్చిన గర్భిణీలు, పదే పదే గర్భస్రావాలు,అసాధారణ జన్యు మార్పిడి, వివిధ దీర్ఘకాలిక రోగాలతో గర్భం దాల్చినవారు గర్భిణీ లేదా ఆమె భర్త కుటుంబాలలో ఎవరైనా బుద్ధిమాంద్యం శారీక వైకల్యాల వ్యాధులు, జన్యుసంబందమైన గర్భస్త పిండానికి సంబందించిన వ్యాధులు కనుగొనడానికి ఆలా పౌండు స్కానింగును వినియోగించుకోవాలే తప్ప, మిగతావారు సాంకేతికతను చెడుకు వినియోగించుకొని స్కానింగులను ఆశ్రయించి గర్భస్త శిశు లింగ నిర్ధారణ విషయాన్ని రిజిష్టరు మెడికల్ ప్రాక్టీనరుద్వారా అక్రమార్గాలలో తెలుసుకొని ఆడ పిల్లని తెలియగానే భ్రూత హత్యలకు పాల్పడటం నేరము శిక్షార్హమన్నారు. ఆడపిల్లలు మన జాతికి పునాదులు, లింగ నిర్ధారణ ఆపాలని, ఆడశిశు లను కాపాడి స్పష్టని రక్షిదామన్నారు. లింగ వివక్షతను పూర్తిగా తొలగించడానికి ప్రత్యేక చొరవ చూపాలని కమిటీ సభ్యులకు ఆమె సూచించారు సమాజంలో స్త్రీ పురుషులు ఇరువురు సమానమేనని స్త్రీ పురుషుల మధ్య వివక్షత ఉండకూడదన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ కన్వీనరు ఎడిఎంహెచ్ఓ పి కోమల, సభ్యులు డిఎస్పీ టివి సంతోష్, గైనకాలజిస్టు డాక్టరు ప్రమీల, పబ్లిక్ పోసేక్యూటరు ఎస్.వి దర్మారావు, నిన్న పిల్లల వైద్యులు డాక్టరు ఆపంద్ తదితరులు పాల్గొన్నారు.