ఉనికి కోసమే 'లోకేష్' పాట్లు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
iraila 03, 2021
TV77తెలుగు రాజానగరం:
ఉనికి కోసమే 'లోకేష్' పాట్లు
వాస్తవాలను వక్రీకరించేలా కుట్రలు
పోలవరం నిర్వాసితులకు అండగా ముఖ్యమంత్రి
ఇచ్చిన హామీని అమలు చేసేందుకు రూ.554 కోట్లు మంజూరు
వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే జక్కంపూడి వెల్లడి
రాజనగరం: తెలుగుదేశం పార్టీ నాయకులు తమ ఉనికిని చాటుకునేందుకు అనేక పాట్లు
పడుతున్నారని, ఇందులో భాగమే ఆ పార్టీ నాయకుడు నారా లోకేష్ పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత ప్రాంతాల్లో
పర్యటన చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే జక్కంపూడి
రాజా విమర్శంచారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. పోలవరం నిర్వాసితులకు
గత ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని గుర్తించే ఆ పార్టీకి ముంపు మండలాల ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నా
విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. పోలవరం నిర్వాసితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే గత
ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో వారికి ఎందుకు పునరావసం కల్పించలేదని ఆయన ప్రశ్నించారు. పునరావస కాలనీల్లో
అగ్గి పెట్టెల మాదిరిగా గృహాల నిర్మాణాలను చేపట్టి ఆ కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలను కల్పించిన
దాఖలాలు లేవన్నారు. నాటి ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్లే నేడు పునరావస కాలనీల్లో నిర్వాసితులు నానా
ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా కాఫర్ డ్యాంను నిర్మించి
నిర్వాసితులను గోదావరిలో ముంచేసిన ఘనత గత ప్రభుత్వానిదేనని విమర్శంచారు. గత ఎన్నికల సమయంలో
ప్రతిపక్ష నాయకుడిగా పోలవరం నిర్వాసితులకు బాధలను ప్రత్యక్షంగా చూసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారిని
ఆదుకునేందుకు వసరమైన చర్యలను తీసుకుంటున్నారని తెలిపారు. బహుళార్ధక సాధక ప్రాజెక్టు పోలవరాన్ని
ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తి చేయాలన్నా సంకల్పంతో ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారని, అందులో భాగంగానే
కాఫర్ డ్యామ్ ను పూర్తి చేసి ఎగువ ప్రాంతంలో ముంపు నివారణకు అవసరమైన చర్యల్లో భాగంగా స్పిల్ వే ద్వారా
గోదావరి వరదను దిగువకు విడుదల చేసేలా పనులను పూర్తి చేయడం జరిగిందన్నారు. గత ఎన్నికల సమయంలో
ఇచ్చిన హామీని అమలు చేసే ప్రక్రియలో భాగంగానే పరిహారాన్ని చెల్లించేలా విధానపరమైన నిర్ణయాన్ని తీసుకున్నారని వెల్లడించారు. నిర్వాసితులకు ఇచ్చిన హామీ ప్రకారం బాధిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఇచ్చేందుకు ఇటీవల కాలంలో జరిగిన కేబినేట్ సమావేశంలో రూ. 554 కోట్లును కేటాయింపులు చేశారని ఆయన గుర్తు
చేశారు. బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు
తీసుకుంటుంటే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వాసితులను రెచ్చగొట్టేలా పర్యటనలు చేస్తూ తెలుగుదేశం
పార్టీ ఉనికిని చాటుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలకు
పాల్పడినా నిర్వాసితుల విషయంలో తమ నాయకుడు చిత్తశుద్ధిని శంకించలేరని అన్నారు. త్వరలోనే నిర్వాసితులందరికీ పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించి తెలుగుదేశం పార్టీ నాయకులకు తగిన గుణపాఠం చెబుతామని ఆయన
పేర్కొన్నారు.