రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పోలీసు అధికారులతో శాంతిభద్రతలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అర్బన్ జిల్లా ఎస్పీ
iraila 03, 2021
TV77తెలుగు రాజమహేంద్రవరం:
అర్బన్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, నేర సమీక్ష పై ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అర్బన్ జిల్లా పరిధిలో నమోదు అయిన ముఖ్యమైన కేసుల గురించి, గ్రేవ్ కేసులు, షెడ్యూల్ కులములు, తెగలుకు చెందిన వారి పై జరిగిన నేరముల గురించి, పెండింగ్ ట్రయిల్ కేసులు, ఆస్థి చోరి కేసుల వాటి దర్యాప్తు, నిందితుల అరెస్టులు వాటికి సంబందించి సమీక్ష నిర్వహించారు . జిల్లాలో జరిగిన అన్ని నేరములకు సంబదించిన నేర నియంత్రణ గురుంచి రాత్రి గస్తి, పెట్రోలింగ్ నిర్వహణ, రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ట్రాఫిక్ రేగ్యులెషన్ గురుంచి, ఆభద్రత, సమస్యాత్మక ప్రదేశాల్లో సీసీ కెమెరాల ఇన్స్టలేషన్ గురుంచి, ప్రత్యేకంగా బ్లేడ్ బ్యాచ్ వ్యక్తుల గురించి వారి నడవడిక ,వారు చేయుచున్న నేరాలు, నియంత్రణ కోసం అధికారులను అడిగి తెలుసుకొని, వారిపై ప్రత్యక నిఘా ఏర్పాటు చేసి వారి ఆగడాలను అరికట్టి ప్రజలకు ఎటువంటి హాని కలుగకుండా వారిని నివారించాలని, కొతమంది కొత్త వ్యక్తులు వీరితో కలసి నేరాలు చేయుటకు పాల్పడుతున్న బ్లేడ్ బ్యాచ్ వ్యక్తులను గుర్తించి వారు చేసిన నేరాలను పరిగణలోనికి తీసుకోని వాటి ద్వారా ఎంత మందిని గుర్తించారు, వారిలో ఎంత మందికి షీట్లును ఓపెన్ చేసి ఉన్నారు, షీట్లు ఓపెన్ చేసేముందు ఆవ్యక్తి చేసిన నేరం, అతని నడవడిక, కుటుంబ పరస్థితి ,ఆర్ధిక పరిస్థితిని పరిశీలించి అతని పై షీట్ ను ఓపెన్ చేయాలి గాని,ఏదో ఒక నేరం చేసినంత మాత్రంనే అనవసరంగా షీట ఓపెన్ చేయవద్దని తెలియపరిచారు, రౌడీ షిటర్ల కార్యకలాపాల పై నిఘా పెంచాలి, అలాగే అర్బన్ జిల్లా పరిధి లో అన్ని పెట్రోల్ బంకులకు పబ్లిక్ సేఫ్టీ ఆక్ట్ ప్రకారము ఎగ్జిట్/ఎంట్రీ వద్ద సి.సి. కెమెరాలను అమర్చలని, అలాగే షాపింగ్ మాల్స్, నేరాలు జరిగే ప్రాంతములో సి.సి. కెమెరాలను అమర్చలని మరి ముక్యముగా మహిళల భద్రత, రక్షణ నిమిత్తం మహిళా కాలేజీలకు , స్కూల్స్, హాస్టల్స్ ఎగ్జిట్/ఎంట్రీ వద్ద సి.సి. కెమెరాలను అమర్చలని అర్బన్ జిల్లా ఏఎస్పీ(అడ్మిన్), ఏఎస్పీ (లా అండ్ ఆర్డర్), డి.ఎస్.పిలు, సి.ఐ లతో సమీక్ష సమావేశం నిర్వహించి తగు ఆదేశాములు ఇవ్వడమైనది.