మై ఇండియా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ సర్వీసులు ప్రారంభించిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా

TV77తెలుగు రాజమహేంద్రవరం: శుక్రవారం రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ నందు మై ఇండియా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో పేదల అందరికీ ఉచిత అంబులెన్స్ సర్వీస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పి.ఆర్ నాగేంద్ర ఒక జర్నలిస్టుగా సమాజానికి అనేక సేవలు అందిస్తున్నారని మరో అడుగు ముందుకు వేసి మై ఇండియా ఫౌండేషన్ ద్వారా పేదలందరికీ ఉచిత అంబులెన్స్ సర్వీస్ ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు.విమర్శలు చేసే వాళ్లే కంటే పేదలను అభాగ్యులను కష్ట సమయంలో సాయం అందించి వారిని ఆదుకోవడమే మానవత్వానికి అర్థమన్నారు.రానున్న రోజుల్లో మై ఇండియా ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని అందరికీ ఆదర్శంగా నిలవాలని,ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆ ఫౌండేషన్ అధినేత,జర్నలిస్ట్ పి.ఆర్.నాగేంద్రను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పార్థసారథి మాట్లాడుతూ జర్నలిస్ట్ అనేవాడు నిరంతరం ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరం చూపిస్తూ ముందుకు సాగుతారని తెలిపారు..సామాజిక బాధ్యతతో ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పి.అర్.నాగేంద్ర ను ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు అంబులెన్స్ (మృతదేహాల తరలింపు)అవసరమైన వారు ఈ నెంబర్ ను8522882267 సంప్రదించాలని పి.ఆర్ నాగేంద్ర కోరారు.. ఈ కార్యక్రమంలో బొంత శ్రీహరి, సోమరాజు, రత్నకిషోర్ తదితరులు పాల్గొన్నారు