వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిచిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దంపతులు

పుష్కర ఘాట్ నందు గణేష్ ప్రతిమ నిమజ్జనం TV77తెలుగు రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ నందు గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే పూజా కార్యక్రమంలో రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా దంపతులు పాల్గొని భక్తి, శ్రద్ధలతో పూజ కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఎంతో ఘనంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించేవారమన్నారు.కరోనా వంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ఎవరికీ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పరిమిత సభ్యులతో పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు.అనంతరం ఆయన చేతుల మీదుగా గోదావరి నదిలో గణేష్ ప్రతిమను నిమజ్జనం చేశారు.భగవాన్ గణనాథుడు యొక్క కరుణాకటాక్షాలు అందరి మీద ఉండాలని,ఏవరు ఏ పని మొదలుపెట్టినా ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తియ్యేటట్టు చూడాలని ఆ మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగిందన్నారు.వినాయక చవితి పర్వదినం పురస్కరించుకొని రాష్ట్రప్రజలందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు తెలియజేశారు.