చేతికొచ్చిన పంట నీటి పాలవడం తో ఆందోళనలో రైతులు....!!
పంట నష్టాన్ని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ దృష్టి కి తీసుకెళ్ళానున్నట్లు రైతులకు భరోసా కల్పించిన కోటికల పూడి గ్రామ సర్పంచ్ రేంటపల్లి నాగరాజు......!!!!
కోటికలపూడి గ్రామం లో నీట మునిగిన మినుములు, కాళీ ప్లవర్, క్యాబేజీ పంట....!!
TV77తెలుగు ఇబ్రహీంపట్నం:
ప్రకృతి ప్రకోపానికి అన్నదాతలు బలైపోయారు.. గులాబ్ తుఫాన్ దాటికి చేతికొచ్చిన పంట నీట మునిగింది.రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల నేపధ్యంలో ఇబ్రహీంపట్నం మండల పరిధిలో కూడా అధిక వర్షపాతం నమోదైంది.. ఈ క్రమంలో మండల పరిధిలోని గ్రామీణ ప్రాంతాల లో మినుము, పెసర, కూరగాయలు పండించే రైతాంగం తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి... భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కోటికలపూడి గ్రామం లో మినుములు, క్యాబేజీ, కాళీ ప్లావర్ పంట నీటిపాలు కావడంతో ఆ గ్రామ రైతులను కోటికల పూడి గ్రామ సర్పంచ్ రెంటపల్లి నాగరాజు పరామర్శించారు... రైతుల నష్టాన్ని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ దృష్టి తీసుకెళ్ళి ప్రభుత్వం తరుఫున రైతులను ఆదుకునే విధంగా పని చేయనున్నట్లు తెలిపారు.
రిపోర్టర్,
సత్య..
మైలవరం