బాహుబలి కాదు బతుకు లోగిలి

బాహుబలి కాదు; బతుకు లోగిలి !! 

ఇది బాహుబలి దృశ్యం కాదు బతుకు చిత్రం !

 విశాఖ మన్యంలో రహదారులు, వంతెనలూ లేక 
  
TV77తెలుగు  విశాఖ జిల్లా చింతపల్లి:
గిరిజనులు పడుతున్న ఇబ్బందులకు ప్రతిబింబం  ఆ పసిబిడ్డకు నాలుగు రోజులుగా తీవ్రమైన జ్వరం . ఎడతెరిపి లేని వర్షాలు . ఉధృతంగా పారుతున్న వాగు . పరిస్థితి ఇలాగే కొనసాగితే పసిబిడ్డ ఏమవుతుందో ... !! 

ఆ తండ్రి సాహసం చేశాడు . బిడ్డను చేతులతో పైకెత్తి  తలమీద పెట్టుకొని పీకల్లోతు వాగులోకి దిగి ఇవతలి ఒడ్డుకు చేరాడు !! 

లోతుగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి బిడ్డను తీసుకెళ్లాడు !! 
 ఆ నాన్నకు జేజేలు ! 
ఆ పాపకు ఆశీస్సులు !! 
"బాబూ  ఓ పాలి గిరిజన గ్రామాల వైపు చూడండి" అని పాలక ప్రభువులకు వేడుకోళ్ళు, విన్నపాలు !!!
 
 విశాఖ జిల్లా చింతపల్లి మండలంలోని కుడుముసారి గ్రామం వద్ద పాంగి సత్తిబాబు అనే తండ్రి తన ఐదు నెలల పాపాయితో ఇలా వాగు దాటుతున్నప్పుడు తీసిన ఫొటో ఇది !!